నానో టెక్నాలజీపై విస్తృత పరిశోధనలు | - | Sakshi
Sakshi News home page

నానో టెక్నాలజీపై విస్తృత పరిశోధనలు

Feb 21 2026 6:46 AM | Updated on Feb 21 2026 6:46 AM

నానో

నానో టెక్నాలజీపై విస్తృత పరిశోధనలు

నానో టెక్నాలజీపై విస్తృత పరిశోధనలు యూనియన్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ పథకంపై అవగాహన కాల్వలో పడి యువకుడి మృతి

తాడేపల్లిగూడెం: నానో టెక్నాలజీపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిఽశోధనలు సాగుతున్నాయని దక్షిణ కొరియాలోని చుంగ్‌–ఆంగ్‌ విశ్వవిద్యాలయ బ్రెయిన్‌ పూల్‌ సైంటిస్టు డాక్టర్‌ గెడ్డా గంగరాజు తెలిపారు. ఏపీ నిట్‌లో కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం గ్రీన్‌ సింథసిస్‌ ఆఫ్‌ నానో మెటీరియల్స్‌ ఆఫ్‌ నానో మెటీరియల్స్‌ ఫర్‌ బయోమెడికల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అప్లికేషన్‌ అంశంపై విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. పర్యావరణానికి హాని కలుగకుండా సహజ వనరులను ఉపయోగించి నానో పదార్తాలను తయారుచేసే విధానాన్నే గ్రీన్‌ సింథసిస్‌ అంటారన్నారు. ఈ గ్రీన్‌ సింథసిస్‌ పద్ధతి పర్యావరణ పరిరక్షణతో పాటు సమర్ధవంతమైన జీవవైద్య పరిష్కారాలను చూపించే భవిష్యత్‌ సాంకేతికతగా గుర్తింపు పొందుతుందన్నారు. కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాఽధిపతి డాక్టర్‌ వినోద్‌కుమార్‌ రాజా, ఆచార్యులు కుల్దీప్‌ రాయ్‌, సుశాంత్‌ బెహరా తదితరులు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): యూనియన్‌ బ్యాంకులో ప్రవేశపెట్టిన కొత్త డిపాజిట్‌ పథకంపై ఖాతాదారులకు అవగాహన కల్పించేందుకు బ్యాంకు సిబ్బంది శుక్రవారం బైక్‌ ర్యాలీ చేపట్టారు. అనంతరం వీరమ్మ పార్కు వద్ద ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రీజనల్‌ మేనేజర్‌ కెఎంఎస్‌ ఉదయగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 444 రోజులకు సాధారణ ప్రజలకు 6.6% వడ్డీ లభిస్తుందని, సీనియర్‌ సిటిజన్స్‌కు 7.10 శాతం, సూపర్‌ సీనియర్లకు 7.35 శాతం వడ్డీ లభిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్‌ హెడ్‌ వెంకన్న బాబు, సత్యనారాయణ, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ నాగేంద్ర ప్రసాద్‌, సీనియర్‌ మేనేజర్‌ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

కలిదిండి(కై కలూరు): బహిర్భూమికి వెళ్ళిన వ్యక్తి కాల్వలో పడి ఊపిరాడక మరణించిన ఘటన కలిదిండి మండలం కోరుకొల్లు పెద్ద కాల్వ వద్ద శుక్రవారం జరిగింది. కలిదిండి పోలీసుల వివరాల ప్రకారం కోరుకొల్లుకు చెందిన వీరవల్లి ప్రసాద్‌(28) ఉదయం 10 గంటల ప్రాంతంలో కాల్వలో కొట్టుకుపోతున్న ప్రసాద్‌ను స్థానికులు రక్షించి కోరుకొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళారు. డాక్టర్‌ పరీక్షించి అప్పటికే మరణించాడని ధ్రువీకరించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నానో టెక్నాలజీపై విస్తృత పరిశోధనలు  
1
1/1

నానో టెక్నాలజీపై విస్తృత పరిశోధనలు

Advertisement
 
Advertisement
Advertisement