పూర్తి స్థాయిలో అమలు కాలేదు
తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయ లేదు. ఎన్నికల సమయంలో ఇంటిలో ఎంత మంది చదివితే అంత మందికి ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున అందచేస్తామని ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించారు. పథకం అమలులో మాత్రం దారుణంగా కోతపెట్టారు. మా ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకాన్ని హమీ ఇచ్చిన మేరకు అమలు చేశాం. ఎన్నికల్లో మేము అబద్దపు హామీలు ఇవ్వలేదు. శాసన మండలిలో తప్పుడు లెక్కలు చెప్పడం దారుణం.
– ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు
రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు గుండు సున్నా పెట్టారు. ముఖ్యంగా తల్లికి వందనం పేరుతో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 15,000 చొప్పున ఇస్తామంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టేసారు. తీరా ఇచ్చే సమయంలో నిబంధనల పేరుతో అర్హులను తగ్గించేసి అరకొరగా కేవలం 13,000 చొప్పున ఇవ్వడం దుర్మార్గం. జగన్ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పేరుతో అర్హులందరికీ రూ.15,000 చొప్పున ఇవ్వడాన్ని తల్లులంతా స్వాగతిస్తున్నారు.
– కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి
పూర్తి స్థాయిలో అమలు కాలేదు


