22న చేనేత గర్జన | - | Sakshi
Sakshi News home page

22న చేనేత గర్జన

Feb 14 2026 10:17 AM | Updated on Feb 14 2026 10:17 AM

22న చేనేత గర్జన

22న చేనేత గర్జన

22న చేనేత గర్జన

పాలకొల్లు సెంట్రల్‌: చేనేత వృత్తి నేడు దారుణమైన కష్టాల్లో ఉందని చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకుడు పిల్లలమర్రి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని వీవర్స్‌ కాలనీలో రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రాల్లో గత 78 ఏళ్లుగా పరిపాలించిన ప్రభుత్వాలు అనుసరించిన చేనేత వ్యతిరేక జౌళి పరిశ్రమ అనుకూల విధానాలే ఆ పరిస్థితికి కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో చేనేత రంగానికి కనీసం రూ.2000 కోట్లు కేటాయించాలని అన్నారు. సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.203 కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనేక చేనేత సమస్యలపై ఈ నెల 22న చేనేత గర్జన నినాదంతో చలో మంగళగిరి కార్యక్రమం చేపట్టనున్నట్లు సూచించారు. మంగళగిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి నేతన్న సర్కిల్‌ వరకూ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement