చంద్రబాబు, లోకేష్‌ను ఏమనాలి ?
ప్రతి తల్లి తమ పిల్లల్ని చదివించుకోవాలన్న సంకల్పంతో అమ్మ ఒడి పథకం తెచ్చింది మాజీ సీఎం జగన్. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి టాయిలెట్స్ మెయింటినెనన్స్ కోసం రూ. వెయ్యి తగ్గిస్తే సైకో అంటూ టీడీపీ, జనసేన నాయకులు విమర్శలు చేశారు. ఇప్పుడు వారు ఏం అభివృద్ధి చేశారని రూ.2 వేలు కోత పెట్టారు. చంద్రబాబు, లోకేష్‌ను ఏమని పిలవాలి.
– కవురు శ్రీనివాస్, ఎమ్మెల్సీ
కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చాక చేస్తున్న పనులకు పొంతన లేదు. అర్హులందరికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పి కొందరికే ఇచ్చింది. రకరకాల కారణాలు చెప్పి ఎంతోమంది అర్హులకు సాయం అందించలేదు. వాస్తవాలు కప్పి పుచ్చి అందరికి ఇచ్చినట్టు శాసన మండలిలో కూటమి నాయకులు చెప్పడం సిగ్గుచేటు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.
– కొట్టు సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం, తాడేపల్లిగూడెం
ఎన్నికల్లో నీకు పదిహేను వేలు, నీకు పదిహేను వేలు అంటూ ఊదరగొట్టారు. అమల్లోకి వచ్చేసరికి రూ. 2 వేలు కోతపెట్టి రూ.13 వేలు మాత్రమే జమచేశారు. అది కూడా కొందరికి రూ.9 వేలు లోపే ఇచ్చారు. ఏవేవో కారణాలు చెప్పి అర్హులకు అన్యాయం చేశారు. మా ప్రభుత్వంలో పాఠశాల అభివద్ధికి తల్లిదండ్రుల అభీష్టం మేరకు రూ. వెయ్యి తగ్గిస్తే నానా రాద్దాంతం చేసిన కూటమి నేతలు ఇప్పుడు నోరుమెదపడం లేదు.
– చెరుకువాడ శ్రీరంగనాధరాజు, మాజీ మంత్రి, ఆచంట
సాంకేతిక కారణాలు, కరెంటు బిల్లులు, ఫోర్ వీలర్స్ సాకుగా చూపించి చాలా మంది అర్హులకు తల్లికి వందనం ఇవ్వలేదన్నది సుస్పష్టం. లబ్ధి పొందిన వారిలోనే కొందరికి రూ.9 వేల లోపే సాయం పొందిన వారు ఉన్నారు. వీటన్నింటిని కప్పిపుచ్చుతూ అందరికీ ఇచ్చేశామంటూ కూటమి నాయకులు మండలి సాక్షిగా అసత్యాలు వల్లె వేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే మండలిలో మా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
– వంకా రవీంద్రనాథ్, ఎమ్మెల్సీ
చంద్రబాబు, లోకేష్‌ను ఏమనాలి ?
చంద్రబాబు, లోకేష్‌ను ఏమనాలి ?
చంద్రబాబు, లోకేష్‌ను ఏమనాలి ?


