వైఎస్సార్‌సీపీలోకి ఆటో యూనియన్‌ సభ్యులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి ఆటో యూనియన్‌ సభ్యులు

Feb 14 2026 10:17 AM | Updated on Feb 14 2026 10:17 AM

వైఎస్సార్‌సీపీలోకి ఆటో యూనియన్‌ సభ్యులు

వైఎస్సార్‌సీపీలోకి ఆటో యూనియన్‌ సభ్యులు

వైఎస్సార్‌సీపీలోకి ఆటో యూనియన్‌ సభ్యులు

పాలకొల్లు సెంట్రల్‌: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ పరిపాలన చూసిన ప్రజలు వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టడానికి ఎదురుచూస్తున్నారని జిల్లా పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల గోపి అన్నారు. పట్టణంలోని రైల్వేగేటు సెంటర్‌కు చెందిన 30 మంది ఆటో యూనియన్‌ సభ్యులు శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతనంగా పార్టీలో చేరిన సభ్యులకు నరసాపురం పార్లమెంటు పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్‌ గుడాల గోపి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ప్రజలు ఛీ కొడుతున్నారని గుర్తించాలి

రాష్ట్రంలో కూటమి పాలన అరాచకాలు, అక్రమాలు చూసిన ప్రజలు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారని గుడాల గోపి చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఛీకొడుతున్నారనే విషయాన్ని కూటమి ప్రభుత్వం గ్రహించాలన్నారు. కూటమి నేతలు ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకొని రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజలకు సక్రమమైన పాలన అందించాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో ఉప్పే సత్యనారాయణ, కుక్కల కృష్ణ, ఉన్నమట్ల శ్రీధర్‌, చేరుగొండి నాగబాబు, శోడదాశి చిట్టిబాబు, ముళ్లపర్తి సాయికుమార్‌, నెవురి శంకర్‌, చొప్పల రాజేష్‌, సాకా ఆనందరావు, బొంద ప్రసాద్‌, లికితపూడి పెద్దిరాజు, విప్పర్తి రంగబాబు, మైలే మోషే, నక్కా నరేష్‌కుమార్‌, శిడగం శ్రీను, యింజమూరి రాకేష్‌, దాకే నాగరాజు, సాగా నర్సింహమూర్తి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి యడ్ల తాతాజీ, నేతలు కోరాడ శ్రీనివాసరావు, జోగాడ ఉమామహేశ్వరరావు, వీరా మల్లిఖార్జునుడు, ఉండ్రాజవరపు రవి, ఉప్పే పండు, పడ్డా అంతర్వేది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement