స్వామి భూములు ఎక్కడ?
న్యూస్‌రీల్
ఆలయ భూముల్ని చూపించాలి
ఆక్వాజోన్‌లో లేకున్నా..
గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
సాక్షి, భీమవరం/ నరసాపురం రూరల్: నరసాపురం రూరల్ కొప్పర్రు శ్రీసీతారామస్వామి దేవస్థానం భూముల కౌలుహక్కుల కోసం గురువారం నిర్వహించ తలపెట్టిన బహిరంగ వేలానికి బ్రేక్ పడింది. ప్రైవేట్ వ్యక్తుల చెరువులో కలిపేసుకున్న ఈ భూములకు సరిహద్దులు నిర్ణయించిన తర్వాత వేలం వేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. కొప్పర్రులోని శ్రీసీతారామస్వామి ఆలయానికి మాన్యం దొడ్డిలో 468/2 సర్వే నంబరులో 1.32 ఎకరాలు, 456/1లో 1.52 ఎకరాలు, 458/1లో 1.60 ఎకరాల సాగు భూమి ఉంది. వీటిని ముగ్గురు రైతులు కౌలు సాగుచేస్తున్నారు. చుట్టుపక్కల సుమారు 35 ఎకరాల పంట పొలాల్ని ఆక్వా సాగు కోసం గత ఏడాది యజమానులు ప్రైవేట్ వ్యక్తికి లీజుకు ఇచ్చుకున్నారు. మే నెలలో ఈ పొలాలతో పాటు దేవుడి భూముల్ని సైతం కలిపేసుకుని ఏకమొత్తం చెరువుగా మార్చేశారు. ఆలయ అధికారులు ఇటీవల హడావుడిగా గతంలోని వారి కౌలు లీజును రద్దుచేయడంతో పాటు ఈనెల 12న కొత్తగా కౌలు నిమిత్తం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. చెరువులో ఆలయ భూములు ఎక్కడున్నది సరిహద్దు గట్లు లేకుండా ఏ విధంగా వేలం వేస్తారంటూ ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు యాదంరెడ్డి సూరిబాబు, రావి బ్రహ్మాజీలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.
చర్యలు తీసుకుంటున్నాం..
ఈ వ్యవహరంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. చెరువు తవ్విన వారికి నోటీసులు ఇచ్చామని, కౌలుదారుల లీజును రద్దుచేశామని, పోలీసులకు ఫిర్యాదుచేసినట్టు ఆలయ ఈఓ రామచంద్రకుమార్ తెలిపారు. చెరువు సాగుచేస్తున్న వారు ప్రస్తుత పంట ముగిసేవరకు సమయం కోరారని, త్వరలో ఆలయ భూములకు సరిహద్దులు నిర్ణయించి వేలం నిర్వహించనున్నట్టు తెలిపారు.
నిబంధనలు పాటించకుండా ఆలయ భూముల్లో అక్రమంగా చెరువులు తవ్వేశారు. దాదాపు 40 ఎకరాల ఏక చెరువులో ఆలయ భూములు ఎక్కడున్నాయో కూడా తెలీని పరిస్థితి. అధికారులకు తెలిసే అంతా జరిగింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆలయ భూముల సరిహద్దు గట్లు వేసిన తర్వాతనే బహిరంగ వేలం వేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశాం.
– యాదంరెడ్డి సూరిబాబు,
ఆలయ కమిటీ మాజీ చైర్మన్
కొప్పర్రు సీతారామస్వామి ఆలయ భూముల బహిరంగ వేలానికి బ్రేక్
పొలాలు లీజుకు తీసుకుని చెరువు తవ్విన ప్రైవేట్ వ్యక్తులు
సమీపంలోని స్వామి భూములు 4.44 ఎకరాలు స్వాహా
తెరవెనుక చక్రం తిప్పిన కూటమి నేతలు
హడావుడిగా 12న బహిరంగ వేలం ప్రకటించిన అధికారులు
చెరువు పరిధిలోని మిగిలిన పొలాలు ఆక్వాజోన్‌లో ఉన్నప్పటికి ఆలయ భూములు మాత్రం ఆక్వాజోన్‌లో లేవని ఫిషరీష్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీటిలో చెరువులు తవ్వడంతో ఆక్వాజోన్ అనుమతుల కోసం హడావుడిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఆలయ భూముల్ని చెరువులో కలపడం వెనుక కూటమికి చెందిన కొందరు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ఒక్క పంట సాగుతో నష్టాలు చవిచూస్తున్న కౌలు రైతులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పొలాలు అప్పగించినట్టు సమాచారం. ఈ వ్యవహారం వెనుక దేవదాయ శాఖ అధికారుల పాత్రపైనా గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మే నెలలోనే చెరువులు తవ్వేసి ఆక్వా సాగు చేస్తున్నా ఇంతకాలం ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ చెరువులో భూములకు ఏడాదికి ఎకరాకు సుమారు రూ.60 వేల చొప్పున లీజు ఒప్పందం కుదిరినట్టు చెబుతున్నారు. ఈ మేరకు గతంతో పోలిస్తే ఆలయ ఆదాయం రెట్టింపు కానున్నా అది రికార్డు పరంగా ఇప్పటి వరకు ఎందుకు చూపలేదంటున్నారు. ఆలయ భూముల్ని చుట్టుపక్కల పొలాలతో కలిపి ఏకచెరువు చేయడం వలన ప్రైవేట్ వ్యక్తుల భూముల్ని లీజుకు తీసుకున్న వారు తప్ప ఇతరులు వేలంలో స్వామివారి భూముల్ని దక్కించుకునే వీలుకాదంటున్నారు. భవిష్యత్తులో ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా గట్లు ఏర్పాటుచేసి బహిరంగ వేలం నిర్వహించే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
స్వామి భూములు ఎక్కడ?
స్వామి భూములు ఎక్కడ?
స్వామి భూములు ఎక్కడ?


