జంగారెడ్డిగూడెం: మండలంలోని కేకేఎం ఎర్రకాలువ రిజర్వాయర్‌లో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం జిల్లాస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను శాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌ఏ అజీజ్ మాట్లాడుతూ శాప్ లీగ్స్‌లో భాగంగా జిల్లా స్థాయి వాటర్ స్పోర్ట్స్ నిర్వహించామన్నారు. కాయాకింగ్, కెనో యింగ్, రోయింగ్, డ్రాగన్ బోట్ తదితర పోటీలు అండర్–15 సబ్ జూనియర్స్, అండర్–18 జూనియర్స్ బాలురు, బాలికల విభాగాల్లో పోటీలు నిర్వహించామని తెలిపారు. ఈ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఎన్‌టీఆర్ జిల్లా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో నిర్వహించే రాష్ట్రస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఎస్.సత్యనారాయణ, ఎస్.రాంబాబు, యడ్ల తేజేశ్వరరావు పాల్గొన్నారు.


