వైఎస్సార్‌ సీపీలోకి చేరికలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి చేరికలు

Apr 3 2026 7:02 AM | Updated on Apr 3 2026 7:02 AM

తాడేపల్లిగూడెం రూరల్‌: క్షేత్ర స్థాయిలో వైఎస్సార్‌ సీపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వడ్డి రఘురాం నాయుడు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని ఎల్‌.అగ్రహారం టిడ్కో గృహ సముదాయం వద్ద జనసేనకు చెందిన పలువురు వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వడ్డీ రఘురాం నాయుడు పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకూ ఎల్లప్పుడూ పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే టిడ్కో గృహ సముదాయంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతీ కార్యకర్త స మష్టిగా పనిచేయాలన్నారు. నియోజకవర్గంలో పార్టీ జెండాను ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు గొర్రెల శ్రీనివాస్‌, కాకర్ల శ్రీనివాస్‌, దత్తి సాయి, మానుకొండ వెంకటేశ్వరరావు, తానేటి అజయ్‌, లంకా రాజశేఖర్‌, గోకా వెంకటేశ్వరరావు, తాళ్ళప్రసాద్‌, వట్టి బుజ్జి, యాండ్రపు వంశీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement