పింఛన్ ఇప్పించండి మహాప్రభో...!
కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు కావస్తోంది. ఇప్పటివరకు నూతన పింఛన్లు మంజూరు చేయలేదు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి నూతనంగా వితంతు, వృద్ధాప్య పింఛన్లు ఏమీ మంజూరు చేయకపోవడంతో ఎందరో వృద్ధులు, వితంతువులు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి అధికారంలోకి వస్తే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు అందజేస్తామని ఎన్నికల హామీగా ప్రకటించారు. నాకు 53 ఏళ్లు ఉన్నా నేటికీ పింఛన్ మంజూరు చేయలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పింఛన్ ఇప్పించాలని కోరుతున్నా.
– కొడమంచిలి వెంకట్రావు, మోదుగ గుంట, తాడేపల్లిగూడెం రూరల్


