నేరాల నియంత్రణపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణపై దృష్టి

Feb 22 2026 6:56 AM | Updated on Feb 22 2026 6:56 AM

నేరాల నియంత్రణపై దృష్టి

నేరాల నియంత్రణపై దృష్టి

నేరాల నియంత్రణపై దృష్టి

ఐజీ అశోక్‌కుమార్‌

పెనుగొండ: ఏలూరు పోలీస్‌ రేంజ్‌ పరిధిలో నేరాల నియంత్రణలో పోలీసులు చురుగ్గా పనిచేస్తున్నారని రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌ అన్నారు. శనివారం ఆచంట పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. కేసుల వివరాలు, క్రైం రేటు, నమోదులపై ఆరా తీశారు. గంజాయి అక్రమ రవాణా నివారణ, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఆయన చెప్పారు. రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా లో జాతీయ రహదారిలో ప్రమాదాలకు అవకాశం ఉన్న 23 బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించామన్నారు. నరసాపురం పట్టణం, పెంటపాడు, తణుకు, తాడేపల్లిగూడెంలో బ్లాక్‌ స్పాట్‌లు ఉన్నాయన్నారు. హైవే అధికారులతో చర్చించి ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని ఐజీ అశోక్‌కుమార్‌ తెలిపారు. అలాగే తణుకు, భీమవరం స్టేషన్లను మోడల్‌ పోలీస్‌స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, ఏఎస్పీ భీమారావు, నరసాపురం డీఎస్పీ డాక్టర్‌ శ్రీవేద, సీఐ రాయుడు విజయకుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement