డిజిటల్‌లో జనగణన | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌లో జనగణన

Feb 21 2026 8:06 AM | Updated on Feb 21 2026 8:06 AM

డిజిట

డిజిటల్‌లో జనగణన

డిజిటల్‌లో జనగణన దివ్యాంగుల పీజీఆర్‌ఎస్‌ మధ్యాహ్న భోజనంపై విస్తృత తనిఖీలు కలికి‘తురాయి’పై కక్ష ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 46 అర్జీలు

భీమవరం (ప్రకాశంచౌక్‌): 2027 జనాభా లెక్కల సేకరణకు ప్రత్యేకత ఉందని, డిజిటల్‌ రూపంలో వివరాలు సేకరించడంతో పాటు వెబ్‌ పోర్టల్‌ ద్వారా ప్రజలు వ్యక్తిగతంగా సెల్ఫ్‌ ఎన్యూమరేట్‌ చేసుకునే వీలుంటుందని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. జనాభా లెక్కల సేకరణపై ప్రిన్సిపల్‌ సెన్సస్‌ అధికారులు కలెక్టర్లతో రాష్ట్రస్థాయి సమావేశాన్ని అమరావతిలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ నాగరాణి సమా వేశానికి హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జనగణనకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): సేవాభావంతో విభి న్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో తొలిసారిగా శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. ఆరోగ్య సమస్యలు, వై ద్యం, ఉపాధి, రూ.15 వేల పింఛన్‌, బ్యాంకు రుణాల కోసం పలువురు అర్జీలు అందించారు. మొత్తంగా 40 అర్జీలను స్వీకరించారు. నలుగురు శారీరక దివ్యాంగులకు జేసీ స్మార్ట్‌ఫోన్లు అందించారు. విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు బి.రామ్‌కుమార్‌, డీఎంహెచ్‌ఓ జి.గీతాబాయి, డ్వామా పీడీ కేసీహెచ్‌ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరుపై జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించినట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. జిల్లాలోని 916 మంది అధికారులు బుధవారం 20 మండలాల్లో పాఠశాలలను తనిఖీ చేసి పథకం అమలును పరిశీలించినట్టు చెప్పారు. 916 పాఠశాలల్లో 61,573 మంది విద్యార్థులకు 52,171 మంది హాజరుకాగా 50,033 మంది మధ్యాహ్న భోజనాన్ని భుజించారన్నారు. పథకాన్ని పటిష్టంగా అమ లు చేయాలని, ఆహార పదార్థాల నాణ్యతలో రాజీ పడబోమని అన్నారు.

పెదవేగి : పెదవేగి మండల కేంద్రంలో 140 ఏళ్ల వయసున్న తురాయి చెట్టును కూలగొట్టడం చర్చనీయాంశంగా మారింది. చెట్టు ఉన్న ప్రాంతం తు రాయి చెట్టు సెంటర్‌గా పేర్గాంచింది. పంచాయతీ అధికారులకు తెలియకుండా శివరాత్రి రోజున ఈ చెట్టును కొందరు కూలగొట్టారు. దీనిపై సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడు. ఇదిలా ఉండ గా చెట్టు తొలగింపు తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌ సీపీల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఇక్కడ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం ఉండటంతో అదే ప్రాంతంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని భావించి చెట్టును తొలగించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు ఏర్పాటుచేశారు. అయితే ఇది ప్రభుత్వ స్థలం అని పోలీసులు జోక్యం చేసుకుని ఆంజనేయస్వామి విగ్రహాన్ని తొలగించారు. విగ్ర హం ఏర్పాటుచేసిన వారికి నోటీసులు ఇచ్చారు.

ఏలూరు(మెట్రో): ప్రభుత్వ ఉద్యోగుల స మస్యల పరిష్కారానికి ప్రతినెలా మూడో శుక్రవారం ఎంప్లాయిస్‌ గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తున్నట్టు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం గ్రీవెన్స్‌ డే నిర్వహించారు. ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నట్టు ఆయన చెప్పారు. 46 మంది ఉద్యోగులు అర్జీలు సమర్పించారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎల్‌.దేవకీదేవి, హౌసింగ్‌ డీడీ జి.సత్యనారాయణ, డీపీఓ కె.అనురాధ, ఏపీఎస్‌జీఓ జిల్లా ప్రెసిడెంట్‌ చోడగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

డిజిటల్‌లో జనగణన 
1
1/2

డిజిటల్‌లో జనగణన

డిజిటల్‌లో జనగణన 
2
2/2

డిజిటల్‌లో జనగణన

Advertisement
 
Advertisement
Advertisement