విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో రిఫ్రిజిరేటర్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో రిఫ్రిజిరేటర్‌ దగ్ధం

Feb 19 2026 10:04 AM | Updated on Feb 19 2026 10:04 AM

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో రిఫ్రిజిరేటర్‌ దగ్ధం

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో రిఫ్రిజిరేటర్‌ దగ్ధం

నరసాపురం రూరల్‌: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఇంట్లోని రిఫ్రిజిరేటర్‌ పేలి మంటలు చెలరేగిన ఘటన మొగల్తూరు మండలంలో చోటు చేసుకుంది. కొండావారిపాలెంకు చెందిన బొడ్డుపల్లి రమేష్‌ గృహంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా బుధవారం సాయంత్రం రిఫ్రిజిరేటర్‌ నుంచి మంటలు అంటుకున్నాయి. నాలుగు గదుల ఆ ఇంటిలో రెండవ గదిలో గల రిఫ్రిజిరేటర్‌ నుంచి అకస్మాత్తుగా మంటలు రావడంతో ఇంటిలోని వారంతా భయాందోళన చెంది బయటకు వచ్చి నరసాపురం ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ప్రమాదంలో రిఫ్రిజిరేటర్‌ ఉన్న గదిలోని మంచం, టీవీ ఇతర ఫర్నీచర్‌ సామగ్రి అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement