కట్టలు తెగిన వివాదం | - | Sakshi
Sakshi News home page

కట్టలు తెగిన వివాదం

Feb 15 2026 12:45 PM | Updated on Feb 15 2026 12:45 PM

కట్టల

కట్టలు తెగిన వివాదం

స్పాట్‌ బిల్లింగ్‌ కాంట్రాక్టర్ల మధ్య పోరు

ఏడీఏ టేబుల్‌పై నోట్ల కట్టల వీడియో హల్‌చల్‌

అధికారులకు తలనొప్పిన వ్యవహారం

తణుకు అర్బన్‌: తణుకు విద్యుత్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో విద్యుత్‌ బిల్లుల రీడర్లకు సంబంధించి ఇద్దరు కాంట్రాక్టర్ల మధ్య తలెత్తిన వివాదం అధికారులకు తలనొప్పిగా మారింది. ఈనెల 13న సాయంత్రం కార్యాలయంలోని ఏడీఈ టేబుల్‌పై రూ.500 నోట్ల కట్టలు (సుమారు రూ.7.50 లక్షలు) ఉంచి.. ‘రీడర్లు అంతా డీఈఈ కార్యాలయానికి వచ్చి మీ జీతాలు తీసుకువెళ్లండి.. ఇప్పుడు రాకపోతే మిమ్మల్ని తొలగిస్తాం’.. అంటూ, తాను విజయవాడకు చెందిన కాంట్రాక్టరునంటూ చేసిన వీడియో వైరల్‌ అయ్యింది. ఏడీఈ చాంబర్‌లో ఏడీఈ బోడపాటి దివాకర్‌ సీటులో ఉండగానే కాంట్రాక్టరు నోట్ల కట్టలు పేర్చి వీడియో తీసి వైరల్‌ చేయడం వివాదాస్పదంగా మారింది.

స్పాట్‌ బిల్లింగ్‌ టెండర్‌లో గందరగోళం

స్పాట్‌ బిల్లింగ్‌కు సంబంధించి గత నవంబరులో జరిగిన టెండర్ల వ్యవహారం గందరగోళంగా మారింది. విజయవాడకు చెందిన శంకర్‌ ఇన్‌ఫ్రా పేరుతో వేసిన టెండరు ఎల్‌ 1గా క్వాలిఫై కాగా, తణుకుకు చెందిన పోతుల మాధురి పేరుతో వేసిన టెండరు ఎల్‌ 2గా రెండో స్థానంలో నిలిచింది. ఎల్‌ 1 కాంట్రాక్టరును వర్కుకు సంబంధించి అగ్రిమెంట్‌కి పిలిచినా రాకపోగా రీడర్లతో బిల్లులు తీయించే నిర్వహణ చేయలేదని, దీంతో నోటీసులు కూడా ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్‌ 2 కాంట్రాక్టర్‌ సదరు నిర్వహణను డిసెంబరు నుంచి చేస్తున్నారు. అయినా సాంకేతిక కారణాలతో వర్కుకు బిల్లు చేయలేదు. ఎల్‌ 2 కాంట్రాక్టర్‌ బిల్లు కోసం అడుగుతున్నా బిల్లు ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరితో కలిపి సబ్‌ డివిజన్‌ కు సంబంధించిన 30 మంది రీడర్లకు మూడు నెలల జీతాల బకాయిలు ఉన్నాయి. తాజాగా అధికారుల చొరవతో ఎల్‌ 1 కాంట్రాక్టర్‌ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తణుకు ఏడీఈ కార్యాలయానికి వచ్చి రీడర్లకు జీతాలు ఇస్తానని.. ముందురోజు వాట్సాప్‌ గ్రూపు ద్వారా తెలిపినా రీడర్లు రాకపోవడంతో.. రీడర్లు అంతా రావాలని, జీతాలు ఇస్తానంటూ డబ్బు కట్టలతో వీడియో చేశారు. అయితే రీడర్లు మాత్రం తమకు గతంలో మాదిరిగా మాధురి ఇన్‌ఫ్రా ద్వారానే బ్యాంకు ద్వారా జీతాలు వేయాలని కోరుతున్నట్టుగా తెలుస్తోంది.

ఒకరు చినబాబు పేషీ..

మరొకరు లోకల్‌ పేషీ

ఇద్దరు కాంట్రాక్టర్లలో ఒకరు చినబాబు పేషీ కాగా, మరొకరు లోకల్‌ పేషీగా వ్యవహారం నడుస్తోందనే గుసుగుసలు వినిపిస్తున్నాయి. దీంతో టెండరు వ్యవ హారం అధికారులకు తలనొప్పిగా మారింది. నిబంధనల ప్రకారం అధికారులు ఎల్‌ 1 వైపు మొగ్గుచూపుతుండగా, స్థానికంగా ఉన్న సిఫార్సులతో తనకే ఇవ్వాలనే దిశగా ఎల్‌ 2 పోరాటం చేస్తున్నట్టుగా గుప్పుమంటోంది. ఈ నేపథ్యంలో నోట్ల కట్టల వ్యవహారం అధికారులను మరింత ఇరకాటంలో పడేసింది. గతే డాది డిసెంబరు ముందు వరకు ప్రస్తుత ఎల్‌ 2 కాంట్రాక్టరు అయిన పోతుల మాధురి టెండరు ద్వారా నిర్వహణ చేశారు. అయితే తాజాగా టెండరు దక్కకపోవడం, ఎల్‌ 1 కాంట్రాక్టరు నిర్వహణకు ముందు కు రాకపోవడంతో ఎల్‌ 2 కాంట్రాక్టరు రీడర్లను మే నేజ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

డబ్బుల వ్యవహారం తెలియదు

స్పాట్‌ బిల్లింగ్‌కు సంబంధించి రీడర్లకు జీతాలు ఇచ్చేందుకు వచ్చిన కాంట్రాక్టర్‌ ఆ డబ్బులు రీడర్లకు ఇచ్చేందుకు తెచ్చినవని, టేబుల్‌పై పెట్టి లెక్కపెట్టుకుంటున్నారని అనుకున్నానని ఏడీఈ బోడపాటి ది వాకర్‌ వివరణ ఇచ్చారు. డబ్బులను వీడియో తీసిన విషయం తనకు తెలియదని అంటున్నారు.

కట్టలు తెగిన వివాదం 1
1/1

కట్టలు తెగిన వివాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement