గుట్కా.. వ్యాపారం జోరుగా.. | - | Sakshi
Sakshi News home page

గుట్కా.. వ్యాపారం జోరుగా..

Feb 22 2026 6:56 AM | Updated on Feb 22 2026 6:56 AM

గుట్క

గుట్కా.. వ్యాపారం జోరుగా..

గుట్కా.. వ్యాపారం జోరుగా..

క్యాన్సర్‌ ముప్పు

మత్తు.. జీవితాలు చిత్తు

జిల్లాలో యథేచ్ఛగా గుట్కా, ఖైనీ అమ్మకాలు

నిఘా నామమాత్రం.. దాడులు తూతూమంత్రం

గతేడాదిగా ఒక్క కేసూ లేదు

భీమవరానికి చెందిన ఓ కార్మికుడు ఖైనీ తినడంతో గొంతు క్యాన్సర్‌ వచ్చింది. ప్రాణాపాయ స్థితిలో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో మూడు నెలలపాటు చికిత్స పొంది కొద్దిరోజులుగా కోలుకుంటున్నాడు. రూ.3 లక్షల వరకూ ఆస్పత్రి ఖర్చులయ్యాయి.

భీమవరం (ప్రకాశంచౌక్‌): క్యాన్సర్‌ కారకాలైన గుట్కా, ఖైనీ అమ్మకాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. మద్యం దుకాణాలు, బెల్టుషాపులు, పాన్‌ షాపులు, కిరాణా దుకాణాల్లో విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా విక్రయాలు జరుగుతున్నాయి. గతంలో గుట్టుచప్పుడుగా చేసే ఈ వ్యాపారం ఇటీవల బహిరంగంగానే సాగుతోంది. ప్రధానంగా రహదారులను ఆనుకునే ఉండే మద్యం, పాన్‌ షాపుల్లో ఏ సమయంలో అయినా గుట్కా, ఖైనీ దొరుకుతోంది.

యువత బా‘నిషా’

ఖైనీ, గుట్కాకు యువత బానిసలవుతున్నారు. మద్యం సేవించిన తర్వాత మరింత మత్తు కోసం వీటిని తింటున్నారు. 20 నుంచి 30 ఏళ్ల యువతే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మద్యం లభించని, మద్యం కొనుగోలుకు డబ్బులు లేని సమయాల్లో తక్కువ ధరకు ఖైనీ, గుట్కాలు నములుతూ మత్తులో తూలుతున్నారు. వీటికి విపరీతంగా అలవాటు పడినవారు క్యాన్సర్‌ వంటి రోగాల బారినపడుతున్నారు.

దాడులు మరిచిన అధికారులు

జిల్లావ్యాప్తంగా గుట్కా, ఖైనీ ప్యాకెట్ల అమ్మకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం పోలీసు దాడులు కూడా జరగడం లేదు. గ తంలో అప్పుడప్పుడు దాడులు చేసి ఖైనీ, గుట్కా ప్యాకెట్లను పట్టుకుని, విక్రయించే వారిపై కేసులు న మోదు చేసేవారు. అయితే ఏడాదిగా జిల్లాలో ఒక్క దాడి జరగలేదు. కనీసం దుకాణదారులకు పోలీ సులు హెచ్చరికలు కూడా జారీ చేయడం లేదు. దీంతో వీటి అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. నిషేధిత పదార్థాలను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యమే కారణమనే విమర్శలు ఉన్నాయి.

ఖైనీ, గుట్కా తీసుకోవడం వల్ల గొంతు, నోరు, ఆహార నాళిక, పేగు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ప్రాణాలు పోయే అవకాశం ఉంది. చిన్నపాటి మచ్చ పడినా కూడా అవయవం తొలగించాల్సి వస్తుంది. నోటి క్యాన్సర్‌ సోకితే ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది పడి క్రమేపి బలహీన పడి ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు పోతాయి. ఖైనీ, గుట్కా వల్ల జరిగే అనర్థాలపై క్యాన్సర్‌ దినోత్సవం నాడు అవగాహన కార్యక్రమాలు ని ర్వహిస్తున్నాం. అలవాటు ఉన్నవారు ఇప్పటికై నా మానుకోవడం ఉత్తమం.

– డాక్టర్‌ ఎన్‌.హరిశ్చంద్ర ప్రసాద్‌, జనరల్‌ మెడిసిన్‌

గుట్కా.. వ్యాపారం జోరుగా.. 1
1/1

గుట్కా.. వ్యాపారం జోరుగా..

Advertisement
 
Advertisement
Advertisement