నేడు మెగా క్రెడిట్ అవుట్ రీచ్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త మెగా వ్యవసాయ రుణ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహిస్తోందని ఆ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సతీష్‌బాబు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తమ బ్యాంక్ రైతులకు, వ్యవసాయానికి, వ్యాపారాలకు అనుకూలమైన ఆర్థిక పరిష్కారాల నిమిత్తం రుణాలు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. రైస్‌మిల్, దాల్ మిల్, ఆయిల్ మిల్ ఏర్పాటుకు రూ.100 కోట్ల వరకు, కోల్డ్ స్టోరేజ్, గోదాం ఏర్పాటు కోసం రూ.50 కోట్ల వరకు, రివాల్వింగ్ క్యాష్ క్రెడిట్ లేదా టర్మ్ లోన్ సపోర్ట్ కింద రూ.20 లక్షల వరకు రుణాలు అందిస్తామని వివరించారు. సోలార్ ప్లాంట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, పౌల్ట్రీ వ్యాపారం లేదా విస్తరణకు రుణాలు మంజూరు చేయనున్నట్టు పేర్కొన్నారు. రుణ సహాయం కోసం 92239 01111 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చని, టోల్ ఫ్రీ నంబర్ 1800 30 30లో కూడా సంప్రదించవచ్చని సూచించారు.


