బురిడీ.. అంకెల గారడీ
న్యూస్‌రీల్
కొత్త పథకాలు, ప్రాజెక్టుల ఊసేలేదు.. పాత ప్రాజెక్టులకు అరకొరగా కేటాయింపులు.. పోలవరం నిర్వాసితుల గోడు పట్టని తీరు.. ఆక్వా వర్సిటీ, వశిష్ట గోదావరి వంతెన నిర్మాణాలు, కొల్లేరు వంటి సమస్యలను విజయవంతంగా అటకెక్కించిన వైనం.. గతేడాది మాదిరిగానే ఈ ఏడాదీ రాష్ట్ర బడ్జెట్‌లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చంద్రబాబు ప్రభుత్వం మొండిచేయి చూపింది. నిధుల కేటాయింపులు, కీలక అంశాలపై కనీసం ప్రస్తావన కూడా లేకపోవడం విచారకరం. రాష్ట్ర బడ్జెట్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాకు లెక్కకు మించిన హా మీలను కూటమి నాయకులు గుప్పించారు. వందల కోట్లతో పథకాలు, ప్రాజెక్టులతో అద్భుతాలు చేస్తామని ఊరూవాడా ప్రచారం చేశారు. తీరా అధికారం చేపట్టిన తర్వాత జిల్లా అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టారు. ఏటా రాష్ట్ర బడ్జెట్‌లో అరకొర కేటాయింపులతో సరిపెడుతున్నారు.
‘కౌలు’కునేదెలా..?
ఉమ్మడి జిల్లాలో 2.45 లక్షల మందికిపైగా కౌలు రైతులు ఉన్నారు. కౌలు వ్యవసాయం ఒడిదొడుకులతో సాగుతోంది. కౌలు రైతుల రక్షణ కోసం ప్రత్యే క చట్టంతో గుర్తింపు ఇచ్చి కౌలురైతులకు కూడా రైతుభరోసా మొదలు అన్ని పథకాల వర్తింపు, గుర్తింపు కార్డుల జారీ, పంట నష్ట పరిహరం వంటివి అందేలా చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హా మీలు ఇచ్చారు. అయితే బడ్జెట్ కౌలురైతుల ప్రస్తావనే లేకపోవడం గమనార్హం.
‘ఆక్వా’ంక్షలు ఫలించేనా..!
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నరసాపురంలో ఆక్వా యూనివర్సిటీని ఏర్పాటుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ యూనివర్సిటీని అటకెక్కించింది. రూ.332 కోట్లతో జరగాల్సిన భవన నిర్మాణానికి అరకొర నిధులను మంజూరు చేయడంతో పాటు వాటిని కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేని పరిస్థితి. గత బడ్జెట్‌లో రూ.36 కోట్లు కేటాయించినా పనులకు అనుమతులు రాలేదు. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.20 కోట్లు మాత్రమే కేటాయించారు.
వంతెన.. యాతన
నరసాపురం ప్రాంతంలో తలమానికంగా ఉండే వశిష్ట గోదావరి వంతెన నిర్మాణానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి అనుమతులతో శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. అయితే చంద్రబాబు పాలనలో రాష్ట్ర బడ్జెట్‌లో రెండేళ్లుగా నిధులు కేటాయించకపోవడంతో ప్రాజెక్టు శంకుస్థాపనకే పరిమితమైంది.
కీలక ప్రాజెక్టులకు రిక్తహస్తం
జిల్లాలో కీలకమైన పోలవరం ప్రాజెక్టు, పునరావాసం, చింతలపూడి ఎత్తిపోతల పథకం, గోదావరి డె ల్టా ఆధునికీకరణ, ఎర్రకాల్వ, కొల్లేరు ఏ ఒక్క దాని కీ న్యాయం జరగలేదు. సుమారు రూ.5 వేల కోట్లు కేటాయించాల్సిన చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.435 కోట్లతో సరిపెట్టారు. గత బడ్జెట్‌లో రూ.220 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు.
● డెల్టా ఆధునికీకరణకు వందల కోట్లు అవసరం కాగా మొక్కుబడిగా రూ.100 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయింపులతోనూ పనులు జరగని పరిస్థితి.
● ఎన్నికల సమయంలో నల్లజర్ల నుంచి తాడేపల్లిగూడెం వరకు ఎర్రకాల్వ ముంపునకు శాశ్వత ప రిష్కారం చూపుతామని కూటమి నాయకులు ప్రకటించారు. అయితే బడ్జెట్‌లో నామమాత్రంగా సాధారణ మెయింటినెన్స్‌కు రూ.10 లక్షలు మాత్రమే కేటాయించారు.
● 122 గ్రామాల ప్రజల జీవనస్థితితో ముడిపడి ఉన్న కొల్లేరుకు సంబంధించి బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేదు. కొల్లేరును 3వ కాంటూరుకు కు దించి జిరాయితీ భూములిస్తాం, కొల్లేరు గ్రామా ల్లో రోడ్లు, తాగునీరు, మౌలిక సదుపాయాలన్ని కల్పిస్తామని ఎన్నికల్లో ప్రకటించి సుప్రీంకోర్టు సాకుతో గాలికి వదిలేశారు.
● పోలవరం ప్రాజెక్టు పరిధిలో నిర్వాసితులకు పరిహారం అలానే పెండింగ్‌లో ఉంది. పరిహారం గురించి బడ్జెట్‌లో ప్రస్తావన కూడా లేదు.
పథకాల ఊసేదీ..
సూపర్ సిక్స్ హామీల పేరుతో కూటమి ప్రభుత్వం నిండా వంచించింది. ఈ బడ్జెట్‌లోనూ ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, రెండు సెంట్ల స్థలాలు వంటి హామీలను ప్రస్తావించలేదు. ఏలూరు జిల్లాలో 6.71 లక్షలు, పశ్చిమగోదావరి జిల్లాలో 6 లక్షల మందికి పైగా మహిళలు ఆడబిడ్డ నిధి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
మోసాల పద్దు
నిధుల్లేవ్.. పథకాల్లేవ్
పాత ప్రాజెక్టులకు అరకొర కేటాయింపులు
అటకెక్కిన వశిష్ట గోదావరి వంతెన
కనిపించని ఫుడ్, ఆక్వా క్లస్టర్లు
ఉమ్మడి జిల్లాకు మరోసారి మొండిచేయి
రాష్ట్ర బడ్జెట్‌పై విమర్శల వెల్లువ
బురిడీ.. అంకెల గారడీ
బురిడీ.. అంకెల గారడీ


