లారీ ఢీకొని వ్యక్తి మృతి
బుట్టాయగూడెం: మోటార్‌సైకిల్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం సమీపంలోని కనకదుర్గమ్మ అమ్మవారి గుడి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అశ్వారావుపేటకు చెందిన నరాలశెట్టి నాగేశ్వరరావు (52) బుధవారం సొంత పనిమీద ద్విచక్రవాహనంపై జీలుగుమిల్లి వెళ్లి తిరిగి వస్తుండగా తాటాకులగూడెం సమీపంలోని కనకదుర్గమ్మ అమ్మవారి గుడి సమీపంలో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై క్రాంతికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి నాగేశ్వరరావు భార్య నాగమల్లేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నాగేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుడి స్వగ్రామం బాపట్ల జిల్లా అని ఉద్యోగ రీత్యా అశ్వారావుపేటలో హార్టికల్చడ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నట్లు నాగమల్లేశ్వరి ఫిర్యాదులో పేర్కొన్నారు.


