స్వర్ణకారుల ఆకలి కేకలు | - | Sakshi
Sakshi News home page

స్వర్ణకారుల ఆకలి కేకలు

Feb 26 2026 9:27 AM | Updated on Feb 26 2026 9:27 AM

స్వర్

స్వర్ణకారుల ఆకలి కేకలు

28న పింఛన్ల పంపిణీ

ప్రభుత్వమే ఆదుకోవాలి

50 శాతం సబ్సిడీతో రుణాలివ్వాలి

కార్పొరేట్‌ దుకాణాలతో తగ్గిన గిరాకీ

బంగారం ధరలు పెరగడంతో పూర్తిగా దిగజారిన ఉపాధి

ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న స్వర్ణకారులు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఒకప్పుడు తాళిబొట్టు చేయాలంటే విశ్వకర్మ వంశస్థుల దగ్గరికి వెళ్ళేవారు. వారు వధూవరుల నక్షత్రాలు చూసి వారికి సరిపడే తారాబలం చూసి ముహూర్తం పెట్టి మంగళ సూత్రాలు చేసేవాళ్ళు. ఇప్పుడు కార్పొరేట్‌ బంగారు దుకాణాలకు వెళ్లి కొంటున్నారు. పెద్ద కంపెనీల బంగారు దుకాణాలకు జనాభా క్యూ కడుతున్నారు. రెడీమేడ్‌గా యంత్రాలతో తయారైన ఆభరణాలు ఆకర్షణీయంగా ఉండడంతో ప్రజలు వాటిపట్ల ఆకర్షితులవుతున్నారని స్వర్ణకారులు చెబుతున్నారు. కార్పొరేట్‌ దుకాణాల ప్రాబల్యం పెరగడంతో స్వర్ణకారుల జీవితాలు ఒడిదుడుకులకు లోనయ్యాయని అంటున్నారు.

పూర్తిగా తగ్గిన ఉపాధి : ప్రస్తుత మార్కెట్‌లో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం కాసు ధర రూ. 1.15 లక్షలు పలుకుతోంది. ఏడాది క్రితం వరకూ బంగారం ధరలు పెరిగినా వారానికో 15 రోజులకో రూ.100 నుంచి రూ. 200 మధ్యలో పెరిగేది. ఇప్పుడు రోజూ రూ.1000 వరకూ పెరుగుతుండడంతో సామాన్యులు బంగారం వైపు కన్నెత్తి చూసే ఆలోచన కూడా చేయలేకపోతున్నారు. దీంతో ఆభరణాలు చేయించుకోలేక మిన్నకుండిపోతున్నారు. ఈ కారణంగా స్వర్ణకార వృత్తిలో ఉన్న వారికి చేతి నిండా పనే లేకుండా పోయింది. ఆభరణాల తయారీ మాత్రమే తెలిసిన స్వర్ణకారులు వేరే వృత్తిలోకి వెళ్ళలేక పోతున్నారు. దీంతో వారి కుటుంబాల్లో ఆకలి కేకలు వేయక తప్పడం లేదు. కుటుంబ పోషణ నిమిత్తం కొంతమంది స్వర్ణకారులు ఏదో ఒక దుకాణంలో సహాయకుడిగా పని చేస్తున్నారు. మరికొంత మంది బ్యాంకుల్లో అప్రైజర్లుగా పని చేసుకుంటున్నారు. గతంలో బ్యాంకు అప్రైజర్లకు వయో పరిమితి ఉండేది కాదు. ప్రస్తుతం బ్యాంకుల్లో అప్రైజర్లుగా పని చేసే వారికి సైతం 60 ఏళ్ళకే పదవీ విరమణ నిబంధన అమలు చేస్తూ ఉండడంతో వారికీ ఆదాయ మార్గాలు మూసుకుపోతున్నాయి.

గతంలో 1500 స్వర్ణకారుల కుటుంబాలు

గతంలో జిల్లాలో స్వర్ణకార వృత్తిలో దాదాపు 1500 కుటుంబాల ఉండేవి. ఆభరణాలు తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన ఆ కుటుంబాలకు మారిన పరిస్థితుల కారణంగా, కార్పొరేట్‌ దుకాణాల వల్ల వృత్తిని వదిలి వెళ్ళక తప్పడంలేదు. ఈ మేరకు నిపుణులైన ఎంతో మంది స్వర్ణకారులు ఇప్పటికే వృత్తికి దూరమయ్యారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కేవలం 150 –200 మధ్య మాత్రమే వృత్తి కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. భవిష్యత్‌లో బంగారు ఆభరణాలు స్థానికంగా తయారు చేసే వారే కరువైపోతారనడంలో సందేహమే లేదని, అదే పరిస్థితి వస్తే కార్పొరేట్‌ వ్యాపారులదే రాజ్యంగా ఉంటుందంటున్నారు. బంగార ఆభరణాల ధరలకు రెక్కలు రావడంతో పాటు నాణ్యత కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందంటున్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లను ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి ఒకటికి బదులుగా ఒకరోజు ముందుగానే ఫిబ్రవరి 28న పింఛన్లను అందజేస్తామని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. మార్చి 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

26 నుంచి వీఆర్వోలకు ఆరోగ్య పరీక్షలు

భీమవరం (ప్రకాశంచౌక్‌): ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి తణుకుతో పాటు తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, భీమవరం ఏరియా ఆస్పత్రుల్లో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 25 వరకు షెడ్యూల్‌ ప్రకారం వీఆర్వోలు, వీఆర్‌ఏలకు నిర్వహించనున్న ఆరోగ్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల వారికి తాడేపల్లిగూడెం హాస్పటల్‌లో, తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాలకు తణుకు ప్రభుత్వ జిల్లా హాస్పటల్‌లో, ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి మండలాలకు సంబంధించి నరసాపురం ప్రభుత్వ ఏరియా హాస్పటల్‌లో, పెనుగొండ, పెనుమంట్ర, ఆచంట, పోడూరు, పాలకొల్లు మండలాలకు సంబంధించి పాలకొల్లు ఏరియా ఆస్పత్రిలో పరీక్షలు చేస్తారన్నారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 25 వరకు భీమవరం, పాలకోడేరు, వీరవాసరం, ఆకివీడు, కాళ్ల, ఉండి, గణపవరం మండలాలకు సంబంధించి భీమవరం ఏరియా హాస్పిటల్‌లో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు.

బంగారం ధరలు విపరీతంగా పెరగడం, కార్పొరేట్‌ దుకాణాల తాకిడి కారణంగా స్వర్ణకారులు ఉపాధికి దూరమైపోయారు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను స్వర్ణకారులకూ అమలు చేయాలి. స్వర్ణకార దుకాణాలకు పూర్తి ఉచిత కరెంటు ఇవ్వాలి. స్వర్ణకార కుటుంబంలో ఆడపిల్ల వివాహానికి రూ.2 లక్షలు ఆర్థిక సహాయం చేయాలి. 50 సంవత్సరాలు నిండిన స్వర్ణకారుడికి రూ.6 వేలు పెన్షన్‌ ఇవ్వాలి.

– లక్కోజు రాజగోపాలాచారి,

కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా స్వర్ణకార సంఘం

స్వర్ణకారులకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయాలి. ప్రతి జిల్లా కేంద్రంలో స్వర్ణకార క్లస్టర్స్‌ ఏర్పాటు చేయాలి. ప్రతి మున్సిపల్‌ పట్టణంలో మున్సిపాల్టీకి సంబంధించిన షాపుల్లో స్వర్ణకారులకి షాపులు కేటాయించాలి. స్వర్ణకారులకు పోలీస్‌ వేధింపులు లేకుండా ఓల్డ్‌ జీవో మార్పు చేసి అమలు చేయాలి. హెచ్‌యూడీ హాల్‌ మార్క్‌ సింగిల్‌ నగలకే పర్మిషన్‌ స్వర్ణకాడికి ఇవ్వాలి. బ్యాంకు అప్రైజర్‌ ఉద్యోగాలు విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులకే కేటాయించాలి.

– బొద్దూరి నాగభూషణం, అధ్యక్షుడు, ఏలూరు నగర స్వర్ణకార సంఘం

స్వర్ణకారుల ఆకలి కేకలు 1
1/3

స్వర్ణకారుల ఆకలి కేకలు

స్వర్ణకారుల ఆకలి కేకలు 2
2/3

స్వర్ణకారుల ఆకలి కేకలు

స్వర్ణకారుల ఆకలి కేకలు 3
3/3

స్వర్ణకారుల ఆకలి కేకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement