అబద్ధాలు, అసత్యాలతో రాష్ట్ర బడ్జెట్
ఆత్మస్తుతి, పరనింద, అబద్ధాలు, అసత్యాలతో రాష్ట్ర బడ్జెట్ ప్రసంగం సాగింది. బడ్జెడ్ గోరంత.. ప్రసంగంలో చెప్పుకుంది కొండంత. బడ్జెట్ కేటాయింపులు భూతద్ధంలో చూపిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం చేసినా నోరు మెదపలేని చంద్రబాబు రాష్ట్ర బడ్జెట్‌లో కేంద్రం నుంచి నిధులు వస్తాయని పేర్కొనడం హాస్యాస్పదమే. లోటు పూడ్చడానికి ప్రజలపై పన్నుల బాదుడు ఉంటుంది. ప్రైవేటీకరణకు పెద్ద పీట వేయడం సరికాదు. రాష్ట్ర సంపదను కార్పొరేట్లకు మళ్లించేందుకు రహదారిగా ఈ బడ్జెట్ ఉంది. చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.
– మామిడి దాన వరప్రసాద్, ఇఫ్టు ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి, తాడేపల్లిగూడెం (టీఓసీ)


