కక్ష సాధింపు చర్యలు ప్రారంభమైనట్టేనా? | - | Sakshi
Sakshi News home page

కక్ష సాధింపు చర్యలు ప్రారంభమైనట్టేనా?

Feb 21 2026 8:06 AM | Updated on Feb 21 2026 8:06 AM

కక్ష సాధింపు చర్యలు ప్రారంభమైనట్టేనా?

కక్ష సాధింపు చర్యలు ప్రారంభమైనట్టేనా?

కక్ష సాధింపు చర్యలు ప్రారంభమైనట్టేనా?

ఉండి: ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ కనుమూరి రఘురామకృష్ణరాజుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు ఇంటిని, ఆయన కార్యాలయాన్ని కూలగొట్టేందుకు అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయంటూ వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎప్పుడూ లేనిది ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు చేసిన అనంతరం ఇరిగేషన్‌ అధికారులు, డీసీ సంఘ నాయకులకు అప్పుడే వెలివర్రు పంటబోదె గుర్తు కొచ్చినట్టుగా సర్వేయర్‌, వీఆర్వో, డీసీ సంఘ చైర్మన్‌ తోట ఫణి, వైస్‌ చైర్మన్‌ మంతెన సాయిలచ్చిరాజు, ఇరిగేషన్‌ ఏఈ ఫణిశంకర్‌ ఆధ్వర్యంలో పలువురు వెలివర్రులో పంట బోదె కొలతలు కొలిచారు. ఇది మా ఆస్తి అంటూ డీసీ చై ర్మన్‌ వ్యాఖ్యలు చేసినట్టుగా వీడియోలు వెలువడ్డాయి.

అక్రమాలను బయటపెట్టాననే..

దీనిపై వెంకటేశ్వరరాజు స్పందిస్తూ తన ఇంటిని, టీడీపీ కార్యాలయాన్ని కక్ష గట్టి కూలగొట్టినా పందిరి వేసుకుని డిప్యూటీ స్పీకర్‌ అక్రమాలు, అన్యాయాలను నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తానని తేల్చిచెప్పారు. రఘురామకృష్ణరాజు అక్రమాలను బయటపెడుతున్నాననే ఉద్దేశంతోనే తనపై కక్ష గట్టారన్నారు. శనివారం వాటిని కూలగొట్టేందుకు వస్తామని తనకు హెచ్చరికలు జారీ చేశారని తెలిపారు. తన ఇల్లు, కార్యాలయం పోయినా ఫరవాలేదు గానీ ఎమ్మెల్యే అక్రమాలను అరికట్టాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌, మంత్రి అచ్చెన్నాయుడు, మరో మంత్రి నిమ్మల రామానాయుడులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు వీడియోలో మాట్లాడారు.

బాధితులంతా తరలిరండి

ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అక్రమాలను అరికట్టకపోతే ఉండి నియోజకవర్గంలో టీడీపీ వినాశనం తథ్యమని వెంకటేశ్వరరాజు అన్నారు. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులు, ఎమ్మెల్యే చేతిలో ఇళ్లు కోల్పోయినవారంతా వచ్చి తనతో కలవాలని ఆయన కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు క్రమశిక్షణతో ఉండాలని చెప్పగా.. తాను విమర్శలు మానుకున్నానని తెలిపారు. డీసీ చైర్మన్‌ తోట ఫణి తన ఇల్లు, కార్యాలయం పడగొడతానని హెచ్చరించగా.. డీసీ వైస్‌ చైర్మన్‌ సాయిలచ్చిరాజు ఇరిగేషన్‌కు సంబంధించి కాదని, ఇది ఇరిగేషన్‌ జాబితాలో లేదని కొట్టించమంటున్నారు కాబట్టే కొట్టిస్తున్నామని అంటున్నారని వెంకటేశ్వరరాజు వివరించారు. నియోజకవర్గంలో ఇళ్లు, చర్చిలు, మసీదులు, ఆలయాలు కోల్పోయిన వారంతా శనివారం ఉదయం 10 గంటలకు వెలివర్రు రావాలని, ఇక్కడి నుంచే అమరావతికి పాదయాత్రగా వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబా బు, మంత్రి లోకేష్‌లను కలిసి వివరిద్దామని వెంకటేశ్వరరాజు తీవ్ర ఆవేశంతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న వీడియోల్లో మాట్లాడారు.

డిప్యూటీ స్పీకర్‌పై టీడీపీ నేత తిరుగుబాటు వ్యాఖ్యలు

ఆయన ఇంటికి వెళ్లి కొలతలు వేసిన అధికారులు

కూలగొట్టేందుకే అంటూ సోషల్‌ మీడియాలో వీడియోలు హల్‌చల్‌

Advertisement
 
Advertisement
Advertisement