దళారులు చెప్పిందే ధర! | - | Sakshi
Sakshi News home page

దళారులు చెప్పిందే ధర!

Feb 23 2026 8:55 AM | Updated on Feb 23 2026 8:55 AM

దళారు

దళారులు చెప్పిందే ధర!

దళారులు చెప్పిందే ధర! సాగు చేయలేం

ఆక్వా రంగంలో దళారులు, వ్యాపారులదే రాజ్యం. వారు నిర్ణయించిందే ధర. రైతుల డిమాండ్‌కు ఏమాత్రం ప్రాధాన్యత లేదు. ప్రభుత్వం కనీస మద్దతు ధరలు నిర్ణయించినా అమలుకు నోచుకోవడం లేదు. నేను 20 ఎకరాల్లో రూప్‌చంద్‌ సాగు చేస్తున్నాను. 50 శాతం చెరువుల్లో చేపలు పట్టుబడికి సిద్ధంగా ఉన్నాయి. ధర రూ.85కు పడిపోవడంతో ఈ ధరకు అమ్మితే పెట్టిన పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదు.

– సంకు శ్రీనివాసరావు, రూప్‌చంద్‌ రైతు

ఏడాది కాలంగా చేపల సాగు నష్టాలతోనే నడుస్తోంది. వ్యాపారులు చేప ధర తగ్గించేయడం, కంపెనీలు మేత ధర పెంచేయడంతో మేం నలిగిపోతున్నాం. 20 ఎకరాల్లో వేసిన రూప్‌చంద్‌ పట్టుబడి దశకు చేరింది. ధర పడిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. విద్యుత్‌ బిల్లులు సైతం తలకుమించి భారంగా మారాయి. ప్రభుత్వం ఆక్వా రైతుల సమస్యలపై దృష్టి సారించి న్యాయం చేయకపోతే ఈ సాగుకు మనుగడ ఉండదు.

– రమేష్‌రాజు, ఆక్వా రైతు, గణపవరం

దళారులు చెప్పిందే ధర! 
1
1/1

దళారులు చెప్పిందే ధర!

Advertisement
 
Advertisement
Advertisement