విద్యార్థులకు చంద్రబాబు వెన్నుపోటు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు చంద్రబాబు వెన్నుపోటు

Feb 19 2026 9:39 AM | Updated on Feb 19 2026 9:39 AM

విద్యార్థులకు చంద్రబాబు వెన్నుపోటు

విద్యార్థులకు చంద్రబాబు వెన్నుపోటు

విద్యార్థులకు చంద్రబాబు వెన్నుపోటు

భీమవరం(ప్రకాశం చౌక్‌): కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకుండా వెన్నుపోటు పోడిచిందని వైఎస్సార్‌సీపీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ పెండ్ర వీరన్న అన్నారు. బుధవారం భీమవరంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.7,900 కోట్లు కూటమి ప్రభుత్వం రూ.1,200 కోట్లకు నాలుగు జీవోలను విడుదల చేసిందని ఇంతవరకు పైసా ఫీజు చెల్లించలేదన్నారు. ఫీజు బకాయిల సాకుతో విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వడం లేదని దాంతో విద్యార్థులను మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక పేద తల్లిదండ్రులు వడ్డీలకు వేల రూపాయలు అప్పులు తెచ్చి ఫీజులు చెల్లిస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేద బిడ్డ పెద్ద చదువుల కోసం పేద విద్యార్థులకు ఫీజుల భారం లేకుండా ఉన్నత చదువులను ప్రభుతం ద్వారా చదివించారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement