నూతన విద్యుత్ చట్టాలతో నష్టం
భీమవరం : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యుత్ చట్టంతో ప్రజలకు ముప్పు వాటిల్లుతుందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బలవంతపు భూ సేకరణ తక్షణం ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం డిమాండ్ చేశారు. శనివారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ, విస్తృత సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం మాట్లాడుతూ చారిత్రాత్మకంగా నిర్వహించిన దేశవ్యాప్త సమ్మెను దేశంలో ఉన్న కార్మిక వర్గం, వ్యవసాయ కూలీలు, పేద రైతులు, కౌలు రైతులు, వృత్తిదారులు, గ్రామీణ పేదలు విజయవంతం చేశారని ఈ సమ్మె భవిష్యత్ పోరాటాలకు నాంది అని అన్నారు. ఉపాధి హామీ చట్టం మార్పు వల్ల వ్యవసాయ కూలీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తక్షణం పాత చట్టాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు.


