పెద్దింట్లమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష
కై కలూరు: జిల్లాలో అతిపెద్ద జాతరల్లో ఒకటైన కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఆర్డీఓ ఎం.అచ్యుత అంబరీష్ సూచించారు. గురువారం జాతరకు సంబంధించిన సమన్వయ సమావేశాన్ని ఆలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అంబరీషన్ మాట్లాడుతూ జాతర ఈ నెల 18 నుంచి మార్చి 3 నిర్వహిస్తారని పేర్కొన్నారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యం వంటి సౌకర్యాల కల్పనలో ముందుండాలన్నారు. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ జాతర అన్ని రోజులు పూర్తి పోలీసు బందోబస్తు చేపడతామన్నారు. అనంతరం జాతర బుక్‌లెట్‌ను అవిష్కరించారు. కార్యక్రమంలో ఘంటసాల వెంకటలక్ష్మీ, తహసీల్దారు రామకృష్ణ, ఆలయ ఈఓ కూచిపూడి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని ఏపీ దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కో–కన్వీనర్, జిల్లా అధ్యక్షులు మేడపాటి వీర వెంకట రాఘవేంద్రరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ మెంబర్ సర్వే(యూఎఫ్‌ఎంఎస్) వల్ల దివ్యాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రత్యేక యూనిట్‌గా గుర్తించాలని, కుటుంబంలో ఇతరులు ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నప్పటికీ, దివ్యాంగులు మాత్రం శారీరక, ఆర్ధిక పరిమితుల వల్ల బలహీనంగానే ఉంటారని తెలిపారు. దివ్యాంగులను వారిని కుటుంబంతో సంబంధం లేకుండా విడిగా సర్వే చేయాలని, సంక్షేమ పథకాల కోత నివారించాలని, కుటుంబ ఆదాయాన్ని ప్రామాణీకంగా తీసుకుంటే దివ్యాంగులకు అందే ఫించన్లు, ఇతర ప్రభుత్వ రాయితీలు రద్దయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవీయకోణంతో ఆలోచించి దివ్యాంగుల ఆర్ధిక స్థితిగతులను విడిగా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇరగవరం: మండలంలోని కె.ఇల్లింద్రపర్రు గ్రామంలో గురువారం విద్యుత్ షాక్‌తో యువ కుడు మృతి చెందాడు. ఎస్సై జానా సతీష్ తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న గ్రామానికి చెందిన గోపిశెట్టి సతీష్ కుమార్ (28) తన స్వగ్రామంలో సొంత ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నాడు. అయితే విద్యుత్ తీగలకు ప్లాస్టిక్ గొట్టం బిగిస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలింది. దీంతో సతీష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.
పెద్దింట్లమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష
పెద్దింట్లమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష


