లడక్‌లో పర్వతారోహణ శిక్షణకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

లడక్‌లో పర్వతారోహణ శిక్షణకు ఎంపిక

Feb 21 2026 6:46 AM | Updated on Feb 21 2026 6:46 AM

లడక్‌లో పర్వతారోహణ శిక్షణకు ఎంపిక

లడక్‌లో పర్వతారోహణ శిక్షణకు ఎంపిక

పెంటపాడు: పెంటపాడు ప్రభుత్వ పోస్టు బేసిక్‌ పాఠశాలలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థి అన్నంనీడి సత్యనారాయణ లడక్‌లో పర్వతారోహణ శిక్షణకు ఎంపికయ్యాడు. ఎంఈవో ఎం.శ్రీనివాస్‌ విద్యార్థిని అభినందించారు. సత్యనారాయణ ఉపాధ్యాయిని సాయి స్వరూప శిక్షణలో పర్వతారోహణపై ఆశక్తి పెంచుకున్నాడు. ఎవరెస్టు అధిరోహణకు రాష్ట్ర స్థాయిలో ఎంపికయ్యాడు. జాతీయ స్థాయిలో హిమాలయ పర్వత శ్రేణుల వద్ద లడక్‌లో జరగనున్న హై ఆల్టిట్యూడ్‌ శిక్షణకు ఎంపికై నట్లు తెలిపారు. ఉపాధ్యాయిని సాయి స్వరూప మాట్లాడుతూ గండికోట అడ్వెంచర్స్‌ స్పోర్ట్‌ అకాడమీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు శిక్షణ పొందాడన్నారు. రాష్ట్రానికి చెందిన 25 మంది దివ్యాంగ విద్యార్థులతో పోటీపడి ఉన్నతశిక్షణకు ఎంపికై న సత్యనారాయణకు ఫిబ్రవరి 23 నుంచి 12 రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement