భాషాశాస్త్రంపై వర్క్‌షాప్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

భాషాశాస్త్రంపై వర్క్‌షాప్‌ ప్రారంభం

Feb 26 2026 9:28 AM | Updated on Feb 26 2026 9:28 AM

భాషాశాస్త్రంపై వర్క్‌షాప్‌ ప్రారంభం

భాషాశాస్త్రంపై వర్క్‌షాప్‌ ప్రారంభం

నూజివీడు : ట్రిపుల్‌ఐటీలో తెలుగుశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల వర్క్‌షాప్‌ బుధవారం ప్రారంభమైంది. ‘లింగ్విస్టిక్‌ లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌’ అనే అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో పలు అంశాలపై సమగ్రంగా చర్చ నిర్వహించారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ తెలుగుశాఖ ఆచార్యులు దేవారెడ్డి విజయలక్ష్మి మాట్లాడుతూ భాషాశాస్త్రాన్ని పరిచయం చేశారు. హెడెల్బర్గ్‌ విశ్వవిద్యాలయ ఆచార్యులు తొట్టెంపూడి గణేష్‌ ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడుతూ లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ అనేవి పెద్ద పరిమాణంలో పాఠ్య డేటాతో శిక్షణ పొందిన ఆధునిక కృత్రిమ మేధస్సు మోడళ్లని, ఇవి మనుషుల భాషను అర్థం చేసుకుని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, కథలు రాయడం, అనువాదం చేయడం వంటి పనులు చేయగలవని వివరించారు. సామాజిక మేలుకోసం ఈ టెక్నాలజీని విద్య, ఆరోగ్య సమాచారం, రైతులకు సూచనలు, ప్రభుత్వ సేవలలో ఉపయోగించవచ్చన్నారు. ఈ రంగంలో నైపుణ్యం సాధించిన వారికి డేటా సైంటిస్ట్‌, ఏఐ ఇంజనీర్‌, ఎన్‌ఎల్‌పీ (నాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెస్‌) స్పెషలిస్ట్‌, మెషిన్‌ లెర్నింగ్‌ డెవలపర్‌ వంటి విభాగాల్లో దేశీయంగా, అంతర్జాతీయంగా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. వర్క్‌షాప్‌ కన్వీనర్‌, తెలుగు శాఖాధిపతి ఉడుము ఝాన్సీ సదస్సు లక్ష్యాలను, ఉద్దేశాలను, ఉపయోగాలను తెలిపారు. అకడమిక్‌ డీన్‌ సాదు చిరంజీవి, వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement