స్పందన | - | Sakshi
Sakshi News home page

స్పందన

Feb 23 2026 8:55 AM | Updated on Feb 23 2026 8:55 AM

 స్పం

స్పందన

స్పందన అక్రమ కలప స్వాధీనం నేడు పీజీఆర్‌ఎస్‌ అడిషనల్‌ ఎస్పీ సస్పెన్షన్‌ బ్యాంకు మేనేజర్‌ చేతివాటం మెడికల్‌ పీజీ సీట్లు ఇప్పిస్తానని మోసం ధరల పాలసీ ప్రకటించాలి

కొయ్యలగూడెం: అక్రమ క లప ట్రాక్టర్‌ స్వాధీనం చేసుకున్నట్టు కన్నాపురం అటవీశాఖ రేంజర్‌ భానుప్రకాష్‌ ఆదివారం తెలిపారు.. కుంకాల నుంచి అక్రమంగా కలపను ట్రాక్టర్‌పై తరలిస్తున్న సమాచారంతో ఎఫ్‌ఎస్‌ఓ మణికుమారి సిబ్బందితో కలిసి దాడులు చేశారన్నారు. ట్రాక్టర్‌ గుర్తించి రేంజ్‌ కార్యాల యానికి తరలించి కేసు నమోదు చేశామన్నారు. కలప అక్రమ రవాణాపై ఈనెల 8న, గత డిసెంబర్‌ 13న ‘సాక్షి’లో వచ్చిన కథనాలకు అటవీ శాఖ స్పందించింది. నెల రోజుల్లో పది కేసుల వరకు నమోదు చేయడం విశేషం.

భీమవరం(ప్రకాశంచౌక్‌): జిల్లా కలెక్టరేట్‌తో పా టు మండల, మున్సిపల్‌ కార్యాలయాల్లో సో మవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని నిర్వహించను న్నట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. ఉ దయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): పశ్చిమగోదావరి జిల్లా అదనపు ఎస్పీ వి.భీమారావును సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడలో డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో ఆయన ఓ యువకుడి హత్య కేసులో పర్యవేక్షణ లోపాల కు బాధ్యులను చేస్తూ సస్పెండ్‌ చేశారు.

తనఖా పెట్టిన బంగారం మాయం

జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ఐఐఎఫ్‌ఎల్‌ బ్యాంకులో ఓ మహిళ కుదవపెట్టిన బంగారాన్ని బ్రాంచ్‌ మేనేజర్‌ మాయం చేశాడు. ఎ స్సై ఎన్‌వీ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాత బస్టాండ్‌ ప్రాంతానికి చెందిన ఎన్‌.ధనలక్ష్మి ఐఐఎఫ్‌ఎల్‌ బ్యాంకులో 270 గ్రాము ల బంగారు ఆభరణాలను 2023లో తనఖా పె ట్టి రుణం తీసుకున్నారు. బ్రాంచ్‌ మేనేజర్‌ ఉ ద్దగిరి చైతన్య రాము రుణంపై వడ్డీ కట్టాలంటూ ఫోన్‌ చేసేవాడు. ధనలక్ష్మి వడ్డీ కట్టలేకపో వడంతో రుణాన్ని అప్‌డేట్‌ చేస్తానని, ధనలక్ష్మి ఫోన్‌కు ఓటీపీ వచ్చిందని చెప్పమని అడిగేవా డు. అలా పలుమార్లు ఓటీపీ తెలుసుకున్నాడు. గత డిసెంబర్‌ 20న ధనలక్ష్మి బంగారాన్ని విడిపించేందుకు బ్యాంకుకు వెళ్లగా ధనలక్ష్మి పేరు న అసలు బంగారం తనఖా లేదని తెలిసింది. చైతన్య రాము ఎప్పుడో మానివేశారని బ్యాంకు సిబ్బంది చెప్పారు. చైతన్య రాము ఆ బంగారా న్ని విడిపించి వేరే వ్యక్తుల పేరున పెట్టినట్టు తె లుస్తోంది. ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసు నమోదు చేశారు.బాధితులు ఇంకా చా లా మంది ఉన్నట్టు ధనలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు.

జంగారెడ్డిగూడెం: వైద్య పీజీ సీట్లు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎన్‌వీ ప్రసాద్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడేనికి చెందిన ఎస్‌కే షంషీర్‌ అహ్మద్‌ రాఘవాపురం పీహెచ్‌సీలో హెల్త్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నా రు. ఆయన పెద్ద కుమార్తె, మేనల్లుడు ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. విదేశాల్లో పీజీ చదువు కో సం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అ హ్మద్‌కు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జి ల్లా మరికల్‌ గ్రామానికి చెందిన గుండా రా ఘవ పరిచయమయ్యాడు. తాను విదేశాల్లో పీజీ సీటు ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో దఫదఫాలుగా షంషీర్‌ అహ్మద్‌ ఫోన్‌పే, ఆన్‌లైన్‌ ద్వారా రూ.19.50 లక్షలు రాఘవకు బదిలీ చేశారు. అనంతరం రాఘవకు ఫోన్‌ చేసినా సమాధానం చెప్పకపోవడం, సీటు ఇప్పించకుండా తప్పించుకుని తిరుగుతూ మాయమాటలు చెప్పుకొచ్చాడు. దీంతో అహ్మద్‌ తాను మోసపోయానని గ్రహించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు.

పెదవేగి: వారం రోజుల్లోగా కోకో గింజల ధర ల పాలసీ ప్రకటించి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధర నిర్ణయించకపోతే కోకో రైతుల పోరాటం తప్పదని ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర స మావేశం హెచ్చరించింది. విజయరాయిలో ఆ దివారం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అ ధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ కోకో గింజల ధరను కి లోకు రూ.350కు తగ్గించడం దారుణమన్నా రు. ఆయిల్‌పామ్‌ మాదిరిగా ఫార్ములాతో కో కో గింజల ధర నిర్ణయించాలని కోరారు.

 స్పందన 1
1/1

స్పందన

Advertisement
 
Advertisement
Advertisement