సంక్షేమాన్ని విస్మరించి..
రాష్ట్ర బడ్జెట్‌లో కార్పొరేట్ల అభివృద్ధి తప్ప ప్రజల సంక్షేమం ఎక్కడా కనిపించలేదు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, సామాజిక న్యాయానికి తోడ్పడేలా లేదు. ప్రచారం మిన్న.. చేతల్లో సున్నా అన్నట్టుగా ఉంది. నెలకు మహిళలకు రూ.1,500, నిరుద్యోగి భృతిపై నిర్దిష్టంగా చెప్పకపోవడం అన్యాయం. పేదలు ఎదురుచూస్తున్న 3 సెంట్లు, 2 సెంట్ల ఇళ్ల స్థలాలకు నిధులు కేటాయించకపోవడం మోసం చేయడమే.
–జేఎన్‌వీ గోపాలన్, సీపీఎం జిల్లా కార్యదర్శి
కూటమి నాయకులు ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు అమలుకు నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరం. పట్టణ ప్రాంతాల్లో 3 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు నిర్మించి పేదల సొంతింటి కల నెరవేరుస్తామన్న హామీ అమలుకు నిధులు కేటాయించలేదు. నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1,500 హామీలను పట్టించుకోకపోవడం ఏరుదాటాక.. తెప్పతగలేసిన చందంగా ఉంది.
–కోనాల భీమారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి
రాష్ట్ర బడ్జెట్‌లో కౌలు రైతులకు మొండిచేయి చూపారు. అన్నదాత సుఖీభవ సాయంపై స్పష్టత ఇవ్వలేదు. పంట నష్టపోయిన రైతులకు పంటల బీమా పరిహారానికి ఎలాంటి కేటాయింపులు జరగలేదు. ధరలు పడిపోయి రైతులు నష్టపోతున్నా పంటలకు కనీసం మద్దతు ధరలు కూడా అందడం లేదు. కౌలు రైతులపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి దయ లేదు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయి.
– కె.శ్రీనివాస్, ఏపీ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి
సంక్షేమాన్ని విస్మరించి..
సంక్షేమాన్ని విస్మరించి..


