జాడలేని ఓడరేవు | - | Sakshi
Sakshi News home page

జాడలేని ఓడరేవు

Feb 23 2026 8:55 AM | Updated on Feb 23 2026 8:55 AM

జాడలే

జాడలేని ఓడరేవు

హార్బర్‌ నిర్మాణం పూర్తి చేయాలి ●

హార్బర్‌ లేకపోవడంతో వశిష్ట గోదావరి గట్టున నిలిపి ఉంచుతున్న వేటబోట్లు

నరసాపురం: నరసాపురం తీర ప్రాంతంలో దశాబ్దాల కలగా ఉన్న ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణాన్ని చంద్రబాబు ప్రభుత్వం విజయవంతంగా అటకెక్కించింది. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసిన ప్రాజెక్ట్‌పై నిండా నిర్లక్ష్యం చూపుతోంది. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో ప్రాజెక్ట్‌ ఊసెత్తకపోవడమే ఇందుకు నిదర్శనం.

గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నరసాపురం మండలం బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2022 మే నెలలో ఏపీ మారిటైమ్‌ బోర్డు టెండర్లు పిలవగా, విశ్వసముద్ర సంస్థ పనులు దక్కించుకుంది. పర్యావరణ, ఇ తర సాంకేతిక అనుమతులు కూడా వచ్చాయి. 600 ఎకరాల విస్తీర్ణంలో రూ.429.43 కోట్ల ని ర్మాణ వ్యయంతో 2023 ఫిబ్రవరిలో ప్రాథమికంగా పనులు కూడా ప్రారంభించారు.

నిర్మాణం.. ప్రశ్నార్థకం

2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంలో ప్రాజెక్ట్‌ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కాంట్రాక్ట్‌ సంస్థ ఎన్నికల ముందు ప్రాథమిక సర్వే వంటి పనులు చేపట్టగా.. ఈ ప్రభుత్వంలో వెనుకడు గు వేసింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించి తీరుతామని హామీలు గుప్పించిన కూటమి నేతలు ప్రస్తుతం దీనిపై ఏమీ మాట్లాడటం లేదు.

మత్స్య ఎగుమతులకు ఊతం

మత్స్య సంపద, ఆక్వా ఎగుమతుల్లో ఉమ్మడి పశ్చిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ నుంచి దేశ, విదేశాలకు ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అ వుతాయి. ఏటా రూ.కోట్ల విదేశీ మారకద్రవ్యం కూడా వస్తుంది. తీరప్రాంతంలో సముద్ర మ త్స్య సంపద ద్వారా కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది. ఏటా నరసాపురం తీరంలో రూ.300 కోట్ల విలువచేసే మత్స్య ఎగుమతులు ఉంటాయి. హార్బర్‌ వంటి మౌలిక వసతులు ఉంటే మరో 40 శాతం ఎగుమతులు పెరిగే అ వకాశం ఉంది. ఈ కారణంతోనే గత ప్రభుత్వం హార్బర్‌ నిర్మాణానికి పూనుకుంది.

బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌ దశాబ్దాలుగా మత్స్యకారుల కల. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరించేలా హార్బర్‌ నిర్మాణానికి గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం చేశారు. అన్ని అనుమతుల కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అప్పట్లో టెండర్లు కూడా పిలిచి, పనులను కాంట్రాక్ట్‌ సంస్థకు అప్పగించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పనులు ఎందుకు మొదలుపెట్టడం లేదనేది అర్థం కావడం లేదు. హార్బర్‌ను నిర్మించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. వెంటనే పనులు ప్రారంభించాలి.

– ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

‘వల’విల

బియ్యపుతిప్ప హార్బర్‌ నిర్మాణంపై నిర్లక్ష్యం

రాష్ట్ర బడ్జెట్‌లో ఊసెత్తని వైనం

ప్రాజెక్టును అటకెక్కించిన చంద్రబాబు ప్రభుత్వం

గత ప్రభుత్వంలో హార్బర్‌ నిర్మాణానికి శ్రీకారం

జాడలేని ఓడరేవు 1
1/2

జాడలేని ఓడరేవు

జాడలేని ఓడరేవు 2
2/2

జాడలేని ఓడరేవు

Advertisement
 
Advertisement
Advertisement