తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

Feb 13 2026 5:35 AM | Updated on Feb 13 2026 5:35 AM

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

కాళ్ల: తాళం వేసి ఉన్న ఇంటి తలుపులు పగులగొట్టి విలువై వెండి, బంగారం, నగదు అపహరించుకుపోయిన సంఘటన మండలంలోని సీసలిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అరవ సత్యనారాయణ ఈ నెల 9న కుటుంబంతో కలసి తిరుపతి వెళ్లారు. తిరిగి 12న ఇంటికి వచ్చేసరికి తాళం పగలకొట్టి ఉండటాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా ఇల్లంతా చిందరవందరగా ఉంది. బీరువా తలుపులు తీసి ఉండడంతో తనిఖీ చేయగా అందులో ఉన్న రూ. లక్ష నగదుతో పాటు నాలుగు కిలోల వెండి, ఒకటిన్నర కాసుల బంగారం పోయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై శ్రీనివాసరావు పరిశీలించి వివరాలు సేకరించారు. భీమవరం క్లూస్‌ టీం సీఐ రాజేష్‌ తన బృందంతో ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement