‘పది’ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

‘పది’ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

Feb 19 2026 9:39 AM | Updated on Feb 19 2026 9:39 AM

‘పది’ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

‘పది’ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

భీమవరం: మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్‌ వశిష్ట సమావేశ మందిరంలో 10 తరగతి, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం విద్యా శాఖ, ఇంటర్‌, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్‌ చదలవాడ నాగరాణి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మార్చిలో జరగనున్న పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, డీఈవో ఇ.నారాయణ, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి జి.ప్రభాకర్‌ రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ వశిష్ట సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్‌ అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల మ్యాపింగ్‌, ఫారం 6, 7, 8 క్‌లైమ్‌ల పరిష్కారం, యువ ఓటర్ల నమోదు ప్రచారం తదితర అంశాలపై సమీక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement