కూటమి ప్రభుత్వం వచ్చాక వచ్చే సంక్రాంతికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు చూస్తారని మైక్ పట్టుకుని ఉపన్యాసాలే తప్పా ఆచరణలో మాత్రం కనపడడం లేదు. గద్దెనెక్కి రెండు సంక్రాంతులైనా ఏలూరు నగరంలో రోడ్లు మాత్రం అలానే ఉన్నాయి. ఈ రోడ్లపై తరుచూ వాహనదారులు అదుపు తప్పి పడిపోయి ప్రమాదాలకు గురవుతున్నా పాలకులు, అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. పాండురంగా థియేటర్ నుండి గజ్జెలవారిచెరువు వరకు రోడ్డు మరీ అధ్వాన్నంగా తయారైంది. ఈ రోడ్డు మీదుగానే కై కలూరు, భీమవరం, పాలకొల్లు, నర్సాపురానికి బస్సులు వెళ్తుంటాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు
బుద్ధా పార్కు ఎదురుగా
బెనర్జీపేటలో రోడ్డు ఇలా


