కల్తీ పాల ఘటనలో మరో ఇద్దరి మృతి | Milk adulteration case: two more die and toll rises to 16 | Sakshi
Sakshi News home page

కల్తీ పాల ఘటనలో మరో ఇద్దరి మృతి

Mar 14 2026 5:46 AM | Updated on Mar 14 2026 5:46 AM

Milk adulteration case: two more die and toll rises to 16

16కు చేరిన మరణాల సంఖ్య  

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో గత నెలలో చోటు చేసుకున్న కల్తీ పాల ఘటనలో శుక్రవారం మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

కిమ్స్‌ బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కడలి కృష్ణారావు (75), డెల్టా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రెడ్డి అనంతలక్ష్మి (55) పరిస్థితి విషమించి మరణించారు. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరింది. ఇంకా ఐదుగురు అత్యవసర చికిత్స పొందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement