కూలర్స్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం ఎగిసి పడుతున్న మంటలు | fire accident in coolers factory at kurnool in andhra pradesh | Sakshi
Sakshi News home page

కూలర్స్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం ఎగిసి పడుతున్న మంటలు

Mar 3 2026 4:00 PM | Updated on Mar 3 2026 4:51 PM

fire accident in coolers factory at kurnool in andhra pradesh

సాక్షి, కర్నూలు: వేసవి వచ్చింది లేదో అప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో వరుస పేలుళ్లు, అగ్ని ప్రమాదాలు ఆందోళన రేపుతున్నాయి.  తాజాగా కర్నూల్‌లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది.  

కర్నూలు బాలాజీ నగర్‌లో మంగళవారం   అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కూలర్ల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి రెండుగ్యాస్‌ సిలిండర్లు భారీ శబ్దంతో పేలాయి. ఫలితంగా చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో తీవ్ర భయాందోళలను నెలకొన్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది  మంటలను అదుపు చేస్తున్నారు. ఆస్థి నష్టం లక్షల్లో ఉంటుందని  ప్రాథమిక అంచనా. 

ఇదీ చదవండి: సీమంతం వేడుకలో భార్యకు సర్‌ప్రైజ్‌, వైరల్‌ వీడియో

Advertisement
 
Advertisement
Advertisement