breaking news
coolers factory
-
కూలర్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం ఎగిసి పడుతున్న మంటలు
సాక్షి, కర్నూలు: వేసవి వచ్చింది లేదో అప్పుడే ఆంధ్రప్రదేశ్లో వరుస పేలుళ్లు, అగ్ని ప్రమాదాలు ఆందోళన రేపుతున్నాయి. తాజాగా కర్నూల్లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. కర్నూలు బాలాజీ నగర్లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కూలర్ల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి రెండుగ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలాయి. ఫలితంగా చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో తీవ్ర భయాందోళలను నెలకొన్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఆస్థి నష్టం లక్షల్లో ఉంటుందని ప్రాథమిక అంచనా. ఇదీ చదవండి: సీమంతం వేడుకలో భార్యకు సర్ప్రైజ్, వైరల్ వీడియో -
కూలర్ల కంపెనీలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: మేడ్చెల్ మండలం మల్లాపూర్ పారిశ్రామికవాడలోని కూలర్ల కర్మాగారంలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్టు సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఐదు ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.


