‘ఏపీలో నిరంకుశ పాలన సాగుతోంది’ | YSRCP MLC Varudu Kalyani Slams Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘ఏపీలోనిరంకుశ పాలన సాగుతోంది’

Feb 15 2026 4:23 PM | Updated on Feb 15 2026 4:57 PM

YSRCP MLC Varudu Kalyani Slams Andhra Pradesh

విజయవాడ:  ఏపీలో నిరంకుశ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి.  కూటమి ప్రభుత్వ పాలనలో విఫలమైందన్నారు. తమ తప్పిదాలను కప్పి పుచ్చుకోవడానికి కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దాలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. 

‘ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని తెరపైకి తెచ్చారు.  ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ పాలన అమలవుతోంది.  తిరుపతి లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ చెప్పింది. 

టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలని కోరినందుకు అంబటి రాంబాబుపై దాడి చేశారు. చంద్రబాబు తమ వారికి ప్రభుత్వ భూములను అన్యాయంగా తక్కువ ధరకు కట్టబెడుతున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ విమర్శించారు.

బూతులు తిట్టిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు... బాధితుడు అంబటి గారు జైల్లో ఉన్నారు

Advertisement
 
Advertisement
Advertisement