విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Feb 15 2026 12:43 PM | Updated on Feb 15 2026 12:43 PM

విజయవ

విజయవాడ సిటీ

ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 మయూర వాహనంపై కార్తికేయుడు –IIలోu మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

న్యూస్‌రీల్‌

పులిచింతల ప్రాజెక్టు సమాచారం

ఎన్టీఆర్‌ జిల్లా
ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

కేజీబీవీని ప్రక్షాళన చేస్తాం

ఎ.కొండూరులోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ శనివారం సందర్శించారు. విద్యార్థుల ఇబ్బం దులను అడిగి తెలుసుకున్నారు.

మోపిదేవి: మహాశివరాత్రిని పురస్కరించుకొని శనివారం సాయంత్రం జరిగిన గ్రామోత్సవంలో శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మయూర వాహనంపై దర్శనమిచ్చారు.

గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ ఆకాంక్షించారు. పారిశ్రామిక రంగాల అభి వృద్ధి లక్ష్యంతో విజయవాడ కూలెక్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భాగస్వామ్యంతో నిర్వహించిన నైపుణ్య వర్క్‌షాప్‌ను గుంటుపల్లి రైజ్‌ సెంటర్‌లో శనివారం నిర్వహించారు. కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ ఆహార ఉత్పత్తుల వ్యాపారం లాభదాయకమన్నారు. ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త కలను సాకారం చేయడానికి ప్రతివారం రైజ్‌ కేంద్రంలో ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహిస్తున్నామని, మహిళలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, ఆర్డీఓ కావూరి చైతన్య, కూలెక్స్‌ ఇండస్ట్రీస్‌ యజమానులు పాలకుర్తి రాధాకృష్ణ, భ్రమరాంబ, సందేశ్‌, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, డీఆర్‌డీఏ పీడీ ఎ.ఎన్‌.వి.నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.

శివోహం

మహాశివరాత్రి ఉత్సవాలకు శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. రంగురంగుల విద్యుత్‌ దీపాల కాంతులతో సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఆలయ ప్రాంగణాల్లో ప్రభబండ్లు కొలువుదీరాయి. ఓం నమఃశివాయ అన్న మహాదేవుని నామ స్మరణతో ఆలయాల ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. యనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయం విద్యుత్‌ దీపాల వెలుగుల్లో కాంతులీనుతోంది.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, విజయవాడ

I

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 4900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నిల్వ 35.8640 టీఎంసీలు.

విజయవాడ సిటీ1
1/6

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/6

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/6

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ4
4/6

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ5
5/6

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ6
6/6

విజయవాడ సిటీ

Advertisement
 
Advertisement
Advertisement