ఈసారీ అరకొరే.. | - | Sakshi
Sakshi News home page

ఈసారీ అరకొరే..

Feb 15 2026 12:43 PM | Updated on Feb 15 2026 12:43 PM

ఈసారీ

ఈసారీ అరకొరే..

బాబు ష్యూరిటీకి కనిపించని గ్యారెంటీ బుడమేరు ఆధునికీరణకు దక్కని చోటు నీటి పారుదల పథకాలకు అరకొరగానే నిధుల కేటాయింపు బందరు పోర్టుకు కేవలం రూ.150 కోట్లు

అటకెక్కిన బుడమేరు

ఆధునికీకరణ

అన్ని వర్గాలకు నిరాశ మిగిల్చిన బడ్జెట్‌

సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసన సభలో శనివారం ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా నిరాశ పరిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి మైట్రో రైలు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, బుడమేరు ఆధునికీకరణ వంటి వాటికి నామ మాత్రంగానూ నిధులు కేటాయించలేదన్న భావన వ్యక్తం అవుతోంది. విజయవాడ కార్పొరేషన్‌కు ఒక్క రూపాయీ ఇవ్వలేదు. నీటి పారుదల రంగానికి గత ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన నిధులే అరకొర, వాటిలోనూ అంతంత మాత్రంగానే ఖర్చు చేశారు. గత ఏడాదికన్నా ఈ ఏడాది తక్కువ నిధులు కేటాయించడం గమనార్హం.

చింతలపూడి ప్రాజెక్టు పూర్తయ్యేనా..?

2026 జూన్‌ నాటికి చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని పాలకులు గొప్పలు చెప్పారు. మైలవరం, తిరువూరు, నూజివీడు నియోజకవర్గాల్లో 2.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, ఆ ప్రాంతాల ప్రజలకు తాగు నీరు అందించే అతి ముఖ్యమైన ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావ లంటే రూ.4 వేల కోట్లకు పైగా అవసరం. గత ఏడాది రూ.30 కోట్లు కేటాయించినా పైసా కూడా ఖర్చు చేయలేదు. ఈ ఏడాది రూ.430 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందని నీటిపారుదల రంగ నిపుణులు విస్మయం వ్యక్తంచేశారు. కృష్ణా డెల్టాకు గత ఏడాది కేవలం రూ.400 కోట్లు కేటాయించినా అరకొరగానే ఖర్చు చేశారు. ఈ ఏడాది రూ.300 కోట్లు మాత్రమే కేటా యించారు. పులిచింతల ప్రాజెక్టుకు గత ఏడాది రూ.16.37 కోట్లు కేటాయించి కొంత మేర నిధులు ఖర్చు చేశారు. ఈ ఏడాదీ బడ్జెట్‌లో అన్నే నిధులు కేటాయించారు. మచిలీపట్నం పోర్టుకు రూ.150 కోట్లతో సరిపెట్టారు. మచిలీపట్నం ిఫిషింగ్‌ హార్బర్‌కు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు మాత్రం రూ.30 కోట్లు కేటాయించారు.

హామీల అమలుకు ఏదీ పూచీ?

సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీల అమలు బడ్జెట్‌లో చేసిన కేటాయింపులతో ఎలా సాధ్యమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై రైతులు పెదవి విరుస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 1,41,726 మంది, కృష్ణా జిల్లాలో 2.70 లక్షల మంది రైతులు ఉన్నారు. ఉచిత పంటల బీమా వంటి పథకాలకు మంగళం పాడారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు అంతంత మాత్రంగానే కేటాయింపులున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో 6,09,032 కుటుంబాలు, కృష్ణా జిల్లాలో ఎనిమిది లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికో ఉద్యోగం మాట అటుంచి బడ్జెట్‌లో నిధులు లేకపోతే భృతి ఎలా అమలవుతుందని ఈ కుటుంబా ల్లోని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే 18 నుంచి 59 ఏళ్లలోపు వయసు ఉన్న ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని ఊదర గొట్టారు. బడ్జెట్‌లో ఈ పథకం ఊసే లేదు. ఎన్టీఆర్‌ జిల్లాలో 8,30,958 మంది, కృష్ణా జిల్లాలో 7,39,202 మంది అర్హులైన మహిళలు ఉన్నారు. వీరంతా బాబు మాటను నమ్మి నిండా ముని గా మని వాపోతున్నారు. డ్వాక్రా మహిళలకు బడ్జె

ట్‌లో మొండి చెయ్యి చూపారు. కృష్ణా జిల్లాలో 28,878 డ్వాక్రా సంఘాల్లో 2,88,633 మంది, ఎన్టీఆర్‌ జిల్లాలో 24,783 సంఘాల్లో 2,45,401 మంది సభ్యులు ఉన్నారు. సున్నా వడ్డీ వంటి పథకాలకు ప్రత్యేకంగా నిధుల కేటాయించకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. బడ్జెట్‌ అంకెల గారడీపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

2024 సెప్టెంబర్‌లో వచ్చిన బుడమేరు వరదలకు బెజవాడ నగరంలో సగం భాగం నీట మునిగింది. పది రోజులకు పైగా వరదలో చిక్కుకొని ప్రజలు అల్లాడారు. ఇకపై నగరం బుడమేరు వరద ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని అప్పట్లో ముఖ్య మంత్రి చంద్రబాబు ప్రకటించారు. బుడమేరును ఆధునికీకరిస్తామని, అక్రమణలను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చారు. అయితే బడ్జెట్‌లో బుడమేరు ఆధునికీకరణకు ఒక్క పైసా కేటాయించలేదు. దీంతో బుడమేరు ప్రభావిత ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈసారీ అరకొరే.. 1
1/2

ఈసారీ అరకొరే..

ఈసారీ అరకొరే.. 2
2/2

ఈసారీ అరకొరే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement