చంద్రబాబు సర్కార్‌ బడ్జెట్‌ ‘దృశ్యం’ సినిమాను తలపిస్తోంది: సీపీఎం | Cpm Protest Against Chandrababu Govt Budget In Vijayawada | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కార్‌ బడ్జెట్‌ ‘దృశ్యం’ సినిమాను తలపిస్తోంది: సీపీఎం

Feb 15 2026 1:40 PM | Updated on Feb 15 2026 2:01 PM

Cpm Protest Against Chandrababu Govt Budget In Vijayawada

సాక్షి, విజయవాడ: చంద్రబాబు సర్కార్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్ దృశ్యం సినిమాను తలిపిస్తోందంటూ సీపీఎం ఎద్దేవా చేసింది. కూటమి బడ్జెట్‌ను నిరసిస్తూ.. విజయవాడలో సీపీఎం ఆందోళనకు దిగింది. నిరసనలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినట్లు , పరిశ్రమలు వచ్చినట్లు, యువతకు ఉపాధి కల్పించేసినట్లు చెబుతున్నారు. దేశం మొత్తంలో 25 శాతం పెట్టుబడులు ఏపీకి వచ్చేశాయని చెబుతున్నారు ..కానీ బడ్జెట్ అందుకు విరుద్ధంగా ఉందంటూ మండిపడ్డారు.

‘‘కోతల మీద వాతలు పెట్టినట్లే ఉంది ఈ బడ్జెట్. రావాల్సిన ఆదాయం తగ్గిపోతోంది. అభివృద్ధి జరగలేదని అంకెల లెక్కలు చెప్పకనే చెబుతున్నాయి. గత రెండేళ్లలో ఎలాంటి అభివృద్ధి లేదని తేలిపోయింది. బడ్జెట్ అంతా అంకెల గారడీ తప్ప ఏమీ లేదు. కౌలు రైతుల గురించి కనీసం ప్రస్తావన లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ..ఊసే లేదు. ఆడబిడ్డ నిధి అన్నారు.. అదీ లేదు.

..సూపర్ సిక్స్‌లో భాగమైనవి ఇవ్వకుండా అన్నీ ఇచ్చేశామంటున్నారు. అమృత్ నిధులు, స్మార్ట్ సిటీ నిధులు ఎటు పోతున్నాయో అర్థం కావడం లేదు. బెజవాడలో ఎటు చూసినా మురికి వీధులు, దోమల మయం. విజయవాడే ఇలా ఉంటి మిగిలిన పట్టణాల సంగతి చెప్పనక్కర్లేదు. రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసి ప్రజల తిరోగమనానికి కారణమైన బడ్జెట్ ఇది’’  అంటూ శ్రీనివాసరావు  ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement