నిత్యాన్నదానానికి విరాళాలు | - | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదానానికి విరాళాలు

Feb 15 2026 12:43 PM | Updated on Feb 15 2026 12:43 PM

నిత్య

నిత్యాన్నదానానికి విరాళాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు విరాళాలు సర్పించారు. విజయవాడకు చెందిన డాక్టర్‌ వి.విజయ్‌కుమార్‌, బి.శాంతికిరణ్‌ బొర్రా సుబ్బారావు, సువర్చలా దేవి పేరిట రూ.1.15 లక్షల విరాళాన్ని ఆలయ ఈఓ శీనానాయక్‌కు అందజేశారు. గుంటూరు బ్రాడీపేటకు చెందిన పి.కామేశ్వరరావు కుటుంబం ఈఓ శీనానాయక్‌ను కలిసి రూ.1,01,116 విరాళం అందజేసింది. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.

మల్లేశ్వర స్వామికి చేనేత పట్టు వస్త్రాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన గంగ, పార్వతి (దుర్గా) సమేత మల్లేశ్వర స్వామికి మంగళగిరికి చెందిన బహుత్తమ పద్మశాలీ సేవా సంఘం ప్రతినిధులు శని వారం చేనేత పట్టు వస్త్రాలను సమర్పించారు. ఏటా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. పట్టు వస్త్రాలను సమర్పించేందుకు విచ్చేసిన సేవా సంఘం సభ్యులకు ఆలయ ఈఓ శీనానాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణ సాదరంగా స్వాగతం పలికారు. సేవా సంఘం సభ్యులు తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం స్వామికి పట్టువస్త్రాలు, పూజా సామగ్రి సమ ర్పించారు. చిల్లపల్లి మోహన్‌రావు, అందే నాగవరప్రసాద్‌, చిల్లపల్లి శ్రీనివాస్‌, తమ్మిశెట్టి జానకీదేవి, గంజి చిరంజీవి, గుత్తికొండ ధనుంజయరావు, దామర్ల నాగమణి, రామనాథం శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

బందోబస్తును పరిశీలించిన ఏలూరు రేంజ్‌ ఐజీపీ

పెనమలూరు: మండలంలోని యనమలకుదురులో శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఏలూరు రేంజ్‌ ఐజీపీ జి.వి.జి.అశోక్‌కుమార్‌ శనివారం పరిశీలించారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుతో కలిసి కొండపైన ఆలయ ప్రాంగణ, కొండ దిగువు ప్రాంతాలను పరిశీలించారు. అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ.. మహాశివరాత్రికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. క్యూలైన్లలో భక్తుల తోపులాట జరగకుండా సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మోనిటరింగ్‌ రూమ్‌లో నిరంతర పరిశీలన చేస్తామన్నారు. స్వామిని ఐజీపీ అశోక్‌కుమార్‌, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు దర్శించుకుని పూజలు చేశారు.

దామోదరం సంజీవయ్య సేవలు చిరస్మరణీయం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండో ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. జిల్లా సాంఘిక సంక్షే మశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయంలోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ లక్ష్మీశ, డీఆర్వో ఎం.లక్ష్మీనర సింహం, ఇతర అధికారులతో కలిసి సంజీ వయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దామోదరం సంజీవయ్య నిరాడంబరత, నిజాయితీ, కార్యదక్షత నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రమాదేవి, కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్ల అధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు, వసతి గహ సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నిత్యాన్నదానానికి విరాళాలు 1
1/2

నిత్యాన్నదానానికి విరాళాలు

నిత్యాన్నదానానికి విరాళాలు 2
2/2

నిత్యాన్నదానానికి విరాళాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement