సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రవేశ పెట్టిన ఐదు బడ్జెట్‌లు ప్రజా ఆమోదయోగ్యమైనవని.. కరోనా లాంటి పరిస్థితుల్లో సైతం సంక్షేమం ఎక్కడా ఆగలేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దారుణంగా ఉందని.. ఆడ బిడ్డ నిధి, నిరుద్యోగ భృతి కేటాయింపు లేదన్నారు. సూపర్ సిక్స్ పథకాలకు సైతం అంతంతమాత్రమే కేటాయింపులు జరిపారన్నారు.
‘‘అన్నదాత సుఖీభవ పథకానికి 6 లక్షల అప్లికేషన్స్ పెండింగ్‌లో వున్నాయి. రైతులను నిట్టనిలువునా మోసం చేసే బడ్జెట్. ఉద్యోగులను, కార్మికులను ఇలా అన్ని రంగాల వారిని మోసం చేశాడు. అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం చేసిన బడ్జెట్‌గా చూడాలి. చంద్రబాబు మోసాలకు అద్దం పట్టే బడ్జెట్’’ అంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు.


