శివ శివా.. ఇవేం ఏర్పాట్లు? | srisailam shivaratri poor arrangements women facilities submerged | Sakshi
Sakshi News home page

శివ శివా.. ఇవేం ఏర్పాట్లు?

Feb 15 2026 7:30 AM | Updated on Feb 15 2026 7:30 AM

srisailam shivaratri poor arrangements women facilities submerged

శ్రీశైలం: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో చేసిన ఏర్పాట్లను చూసి భక్తులు సిగ్గుతో తలదించుకుంటున్నారు. లింగాలగట్టులో ప్రణాళిక లేకుండా లో లెవల్, హై లెవల్‌ ఘాట్‌ల వద్ద మౌలిక సదుపాయాలను తూతూమంత్రంగా ఏర్పాట్లు చేయడంతో స్త్రీలు బట్టలు మార్చుకునే గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు కృష్ణా నది నీటిలో మునిగాయి. పుణ్యస్నానాలు ఆచరించిన మహిళలు గత్యంతరం లేక చీరలను అడ్డుగా కట్టి దుస్తులు మార్చుకుంటున్నారు. అరకొరగా ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్లు కూడా నీటిలో మునిగిపోయాయి.ఈ పరిస్థితులను అక్కడ విధులు నిర్వర్తిస్తున్న జిల్లా పంచాయతీ అధికారిణి కె.లలితాబాయి దృష్టికి భక్తులు తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement