సాక్షి, తాడేపల్లి: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ని వెంటనే అరెస్టు చేయాలని.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తప్పు చేసిన ఎమ్మెల్యేని అరెస్టు చేసే దమ్ము చంద్రబాబుకు లేదా? అంటూ నిలదీశారు. కోనేటి ఆదిమూలం, నసీర్ అహ్మద్, కూన రవికుమార్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు. తిరుపతిలో కిరణ్ రాయల్‌పై కేసు నమోదు చేసే ధైర్యం కూడా ప్రభుత్వం చేయలేదని దుయ్యబట్టారు.
‘‘అరవ శ్రీధర్ చేసిన పనితో ఆడపిల్లలకు రాష్ట్రంలో రక్షణ లేదని అర్థం అవుతుంది. జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు కీచకులుగా మారారు. పోలీసు వ్యవస్థ ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉందా?. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఎందుకు మాట్లాడటం లేదు?. కూటమి ఎమ్మెల్యేపై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు.?
..హోంమంత్రి అనితకు పబ్లిసిటీ, రీల్స్‌పై ఉన్న శ్రద్ధ మహిళ భద్రతపై లేదు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ కనీసం స్పందించ లేదు. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోయారు.?. ఎమ్మెల్యేపై పార్టీ కమిటీ వేయడం ఏంటి? పోలీసుల విచారణ వుండదా?. మంత్రి సంధ్యారాణి కొడుకు పేకాట అడుగుతూ దొరికిపోయారు’’ అంటూ వరుదు కల్యాణి మండిపడ్డారు.


