వన్‌స్టాప్‌ సెంటర్లతో మహిళల భద్రతకు భరోసా | - | Sakshi
Sakshi News home page

వన్‌స్టాప్‌ సెంటర్లతో మహిళల భద్రతకు భరోసా

Feb 6 2026 7:17 AM | Updated on Feb 6 2026 7:17 AM

వన్‌స్టాప్‌ సెంటర్లతో మహిళల భద్రతకు భరోసా

వన్‌స్టాప్‌ సెంటర్లతో మహిళల భద్రతకు భరోసా

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): వన్‌ స్టాప్‌ సెంటర్లు (ఓఎస్‌సీ) మహిళల భద్రతకు భరోసా కల్పిస్తున్నాయని, బాధిత మహిళలకు గౌరవం, న్యాయం కల్పించేందుకు కృషిచేస్తున్నాయని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ప్రాంగణంలో బుధవారం ఇగ్నైట్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ సఖి వన్‌ స్టాప్‌ సెంటర్‌కు కేటాయించిన ప్రత్యేక వాహ నాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలపై హింసను అరికట్టడం, బాధిత మహిళలకు తక్షణం సమగ్ర సహాయం అందించడంలో సఖి – వన్‌ స్టాప్‌ సెంటర్‌ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఈ కార్యక్ర మంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అధికారి రుక్సానా సుల్తానా బేగం, విజయవాడ అర్బన్‌ సీడీపీఓ జ్యోత్స్న, మిషన్‌ శక్తి కోఆర్డినేటర్‌, సూపర్వైజర్లు, ఆంగన్‌వాడీ కార్యకర్తలు, సఖి వన్‌ స్టాప్‌ సెంటర్‌ సిబ్బంది, జిల్లా బాలల సంరక్షణ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement