బాబోయ్‌ బస్సు ప్రయాణం! | - | Sakshi
Sakshi News home page

బాబోయ్‌ బస్సు ప్రయాణం!

Feb 13 2026 5:33 AM | Updated on Feb 13 2026 5:33 AM

బాబోయ

బాబోయ్‌ బస్సు ప్రయాణం!

బాబోయ్‌ బస్సు ప్రయాణం!

అధిక వేగమే కారణం..

రోడ్డు ప్రమాదాలకు ఎక్కువగా ప్రైవేటు బస్సులే కారణమవుతున్నాయి. ఇవి అధిక వేగంతో వెళ్తున్నా నివారించేందుకు ఎలాంటి సాంకేతికతను రవాణా శాఖ వినియోగించటం లేదు.

ప్రైవేటు బస్సులు గరిష్టంగా 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంగా వెళ్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు నాలుగు గంటల్లో చేరుతున్నాయి. కీసరలో బుధవారం తెల్లవారుజామున జరిగిన సంఘటనలో వరుణ్‌ ట్రావెల్స్‌ బస్సు అధిక స్పీడే కారణమని తెలుస్తోంది.

హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ప్రైవేటు బస్సు ఎక్కువ వేగంగా వస్తూ ముందు వెళ్తున్న సుగర్‌ లారీని ఢీకొంది. దీంతో 11మంది గాయాలపాలయ్యారు.

ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులంటేనే హడల్‌ అగ్నికి ఆహుతవుతున్న బస్సులు ఒక ప్రమాదం నుంచి తేరుకోకముందే మరొకటి

వరుస రోడ్డు ప్రమాదాలతో ప్రయాణికుల బెంబేలు

భద్రతా ప్రమాణాలు పాటించాలి..

కంచికచర్ల: వరుస రోడ్డు ప్రమాదాలతో బస్సుల్లో ప్రయాణమంటేనే ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఒకటి మరువక ముందే మరొకటి సంభవిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. గత అక్టోబర్‌ 24వ తేదీ తెల్లవారుజామున కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో కల్లూరు మండ లం చినటేకూరు గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20మంది మృత్యువాత పడిన ఘటన మరువక ముందే అదే తరహాలో ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలో చోటుచేసుకుంది. అయితే డ్రైవర్‌ అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పింది.

డ్రైవర్‌ చూసి ఉండకపోతే..

హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తున్న ఇంటర్‌ సిటీ వరుణ్‌ ట్రావెల్స్‌ బస్సులో 39మంది ప్రయాణికులు ఉన్నారు. వారితో పాటు డ్రైవర్‌, క్లీనర్‌ కూడా ఉన్నారు. కీసర టోల్‌గేట్‌ను శనివారం తెల్లవారుజామున 5.26గంటలకు దాటిన బస్సు 65వ నంబర్‌ జాతీయ రహదారిపై ఎన్‌ఎస్పీ కెనాల్‌ సమీపంలోకి రాగానే బస్సు వెనుక భాగంలో ఉన్న ఇంజిన్‌ నుంచి పొగలు రావటం బస్సు డ్రైవర్‌ చంద్రమౌళి గుర్తించాడు. బస్సును ఆపి కిందకి దిగి వెనుక ఇంజిన్‌ వద్దకు వెళ్లి చూడగా పెద్దపెద్ద పొగలు వస్తున్నాయి. అప్రమత్తమైన బస్సు డ్రైవర్‌ బస్సులో గాఢనిద్రలో ఉన్న ప్రయా ణికులను కేకలు వేస్తూ లేపి కిందకు దించాడు. వారి సామగ్రిని కూడా క్లీనర్‌ సాయంతో కిందకు దించారు. ఆ కొద్దినిముషాలకే బస్సుకు మంట లు వ్యాపించాయి. డ్రైవర్‌ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అగ్నిమాపక శాఖ అధికారులకు తెలియజేశారు. వారు రెండు ఫైర్‌ ఇంజిన్లను సంఘటనా స్థలానికి తీసుకువచ్చి మంటలను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే బస్సు వెనుకభాగం పూర్తిగా కాలిపోయింది. 39 మంది ప్రయాణికులు బస్సు తగులబడుతుంటే నిశ్చేష్టులయి చూస్తుండిపోయారు.

బస్సుల్లో సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవటం వల్ల బస్సుల్లో మంటలు వ్యాపిస్తాయి. ఒక్కోసారి బస్సు ఇంజిన్‌ వేడెక్కటం వల్ల కూడా మంటలు వస్తాయి. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవటం, మితిమీరిన వేగంతో బస్సులు నడపటం వల్ల ఇంజిన్‌ వేడెక్కుతుంది. కొన్ని గంటలు ఏకధాటిగా బస్సును నడిపిన తర్వాత ఒక గంట పాటు రోడ్డు పక్కన బస్సును ఆపాల్సి ఉంటుంది.

– ఎ. శివారెడ్డి, ఫైర్‌ అధికారి, కంచికచర్ల

బాబోయ్‌ బస్సు ప్రయాణం! 1
1/2

బాబోయ్‌ బస్సు ప్రయాణం!

బాబోయ్‌ బస్సు ప్రయాణం! 2
2/2

బాబోయ్‌ బస్సు ప్రయాణం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement