ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు..
ఉపాధ్యాయుల జీతాల సమస్యపై పలుమార్లు జిల్లా విద్యాశాఖాధికారులకు వినతిపత్రాలను అందించాం. పలు రూపాల్లో ఉన్నతాధికారుల వద్ద ఉపాధ్యాయులకు నిలిచిన జీతాల సమస్యపై చర్చించాం. అయినా వారు సరైన రీతిలో స్పందించకపోవటంతో రాష్ట్ర కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాలేదు. సమస్య ఏదైనా త్వరతగతిన పరిష్కరించాల్సిన అధికారులు స్పందించకపోవటంతో ఏడు మాసాలుగా పలువురు జీతాలు పొందటం లేదు. ఇప్పటికై నా స్పందించాలి.
– ఏ సుందరయ్య, ప్రధాన కార్యదర్శి,
యూటీఎఫ్, ఎన్టీఆర్ జిల్లా


