చంద్రబాబూ ఇది గుర్తించుకో: చెవిరెడ్డి | Chevireddy Bhaskar Reddy Visited Jogi Ramesh Family | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ ఇది గుర్తించుకో: చెవిరెడ్డి

Feb 13 2026 6:17 PM | Updated on Feb 13 2026 6:40 PM

Chevireddy Bhaskar Reddy Visited Jogi Ramesh Family

సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టుల ద్వారా కక్ష సాధించాలనుకుంటే వైఎస్సార్‌సీపీ నేతలు భయపడరన్నారు. ఇళ్లపై దాడులు చేసే సంస్కృతిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని.. ఇలాంటి సంస్కృతి చాలా ప్రమాదకరమన్నారు.

‘‘ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి. ఎన్నికల హామీలను ప్రభుత్వం గాలికివదిలేసింది. ఈ రోజు ఎన్నికలు జరిగినా చంద్రబాబు ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు ఇదే సంస్కృతి కొనసాగిస్తే మనశాంతిగా ఎవరైనా ఉండగలరా?. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పిన ప్రభుత్వం ఇలాంటి సంస్కృతిని తెచ్చింది. ఇలాంటి సంస్కతిని చూశాక ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? అంటూ చెవిరెడ్డి ప్రశ్నించారు.

‘‘ప్రజా జీవితంలో ఉన్న నాయకులకు భద్రత లేదు. ఇక పెట్టుడులు పెట్టడానికి వచ్చే వ్యాపారులకు భద్రత ఎక్కడ?. పోరాటాలతో పుట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ. ఇలాంటి అక్రమ కేసులు, దాడులు, ఇళ్లు తగలబెడితే భయపడతారనుకోవడం అమాయకత్వం’’ అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement