సాక్షి,తెలంగాణ భవన్: కొత్తగూడెం కార్పొరేషన్ హంగ్ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ట్విస్ట్ ఇచ్చింది. సీపీఐకి బీఆర్‌ఎస్ బహిరంగ మద్దతు ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయి. మున్సిపాలిటీల్లో 2,500 స్థానాల్ని గెలుచుకోబోతున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విరోచిత పోరాటం చేశారు. కలిసొచ్చే లౌకిక పార్టీలను కలుపుకుని పోతాం.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ నేతల నోళ్లు మూతపడ్డాయి. కొన్ని చోట్ల మా కౌన్సిలర్లను బలవంతంగా లాక్కెళ్లారు. ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ నేతలు కుట్రలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మంచి ఫలితాలొచ్చాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం,డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టింది.సింగరేణిలో జరుగుతున్న కుంభకోణణాన్ని బయటపెట్టాం. కొత్తగూడెం సింగరేణి బెల్ట్‌లో భాగం. కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇస్తాము. ఇదే విషయంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో మాట్లాడాం. కాంగ్రెస్,బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లౌకిక పార్టీలతో బీఆర్ఎస్ కలిసి పని చేస్తుంది. కాంగ్రెస్,బీజేపీ కుయుక్తులు పన్నుతున్నాయి.
కాంగ్రెస్‌ను గద్దె దించే శక్తి ,బీజేపీ అడ్డుకునే శక్తి బిఆర్ఎస్ పార్టీకే ఉంది. మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఫలితాలు సంతృప్తినిచ్చాయి.
హైదరాబాద్ కార్పోరేషన్ , ఎంపీటీసీ,జెడ్పీటీ ఎన్నికల్లో ఇదే ఉత్సాహం కనబరుస్తాం. ఈ దేశం చాల గొప్పది, ఇందిరా గాంధీ, ఎన్‌టీఆర్ లాంటి వారే ఓడిపోయారు. రెండేళ్లలో కాంగ్రెస్ పాలనలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ సఫలం అవుతుంది. 2029లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.
అధికార పార్టీ చాలా రకాలుగా సామ దాన దండోపాయలు ప్రదర్శించినా..ప్రజల మనస్సులు గెలుచుకోలేదు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి 40శాతం సర్పంచులు గెలిపించారు. నోరు మూసుకునేలా పురపోరులో ఫలితాలు సాధించాం.750 వరకు వార్డుల్లో BRS గెలుస్తుంది. వీరోచిత పోరాటం చేశాం.అధికారులను అడ్డం పెట్టుకొని కొన్ని వార్డుల్లో గెలిచి ప్రయత్నం చేస్తున్నారు.
15 మున్సిపాల్టీలను సింగిల్ గా కైవసం చేసుకున్నాం.. మరో 15 మున్సిపాలిటీల్లో కూడా ఇతరుల సాయంతో అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బులు, మద్యం, అక్రమాలు తారా స్తాయికి చేరాయి.రేపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు బిఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు గులాబీ జెండా పట్టుకొని తిరగాల్సి వస్తుంది.కాంగ్రెస్,బీజేపీ కలిసి పని చేస్తున్నట్లు అందరు చూస్తున్నారు.
సింగరేణిలో దోపిడీపై ప్రశ్నిస్తే కాంగ్రెస్,బీజేపీ నుంచి సమాధానం లేదు. కాంగ్రెస్,బీజేపీలను నిరోధించే శక్తి బీఆర్‌ఎస్‌కే ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో మా నాయకులు,కార్యకర్తలు విరోచితంగా పోరాడారు. గద్వాలలో అధికారులను అడ్డం పెట్టుకుని గెలిచారు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు.


