Jul 24 2026 10:45 AM | Updated on Jul 24 2026 11:03 AM
సాక్షి, తాడేపల్లి:వైఎస్సార్‌సీపీలో నూతన నియామకాలు జరిగాయి. పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పలువురు నేతలకు కొత్త బాధ్యతలు అప్పగించారు.
వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సభ్యునిగా పీవీఎల్నరసింహరాజును నియమించారు. పార్టీ కార్యక్రమాలు, రాజకీయ వ్యూహాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే PACలో ఆయనకు స్థానం కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో..
ఉండి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మంతెన యోగీంద్రకుమార్ (బాబు)ను నియమించారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడం వంటి బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు.
గత ఎన్నికల అనంతరం పార్టీని పునర్‌వ్యవస్థీకరించే పనిలో ఉన్న వైఎస్సార్‌సీపీ.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే అనుభవం ఉన్న నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేతలు పార్టీ కార్యక్రమాలను మరింత చురుగ్గా ముందుకు తీసుకెళ్తారని వైఎస్సార్‌సీపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వచ్చే రోజుల్లో మరిన్ని సంస్థాగత మార్పులు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నరసింహారాజు గారిని, మంతెన యోగీంధ్ర కుమార్ (బాబు) గారిని వివిధ హోదాల్లో నియమించిన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు. pic.twitter.com/lkepRLg5sY