ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయాలు ఉండాలి
ఇబ్రహీంపట్నం: రాజకీయాలు ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలేకానీ అరాచకాలు, దాడులను ప్రోత్సహించకూదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను మంగళ వారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా సాకే శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ.. బయటి ప్రాంతాల నుంచి వచ్చి జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకుల తీరును తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం యాసిడ్, పెట్రోల్ బాంబులతో దాడులను కక్ష పూరితంగా ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఇటువంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. జోగి రమేష్ కుటుంబం వైఎస్సార్ సీపీకి సేవలు అందించిందని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సూర్తిస్థాయిలో అండగా నిలిచిందని పేర్కొన్నారు. రాజకీయాల్లో దాడులను ప్రోత్సహించకపోవడం కూటమి ప్రభుత్వానికే మంచి దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేడపాటి నాగిరెడ్డి, జిల్లా కార్యదర్శి మిక్కిలి శరభయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నల్లమోతు ప్రకాశ్, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు గోగులమూడి రాణి, డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు కోలకాని శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే శైలజానాఽథ్


